ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం..

Published: Monday August 08, 2022

జగిత్యాల ఆగస్టు, 07 ( ప్రజాపాలన ప్రతినిధి): జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జగిత్యాల పట్టణంలోని చేనేత సహకార సంఘంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనీ మార్కండేయ చిత్ర పటానికి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే లు డా.సంజయ్ కుమార్, విద్యాసాగర్ రావు, సుంకే రవి శంకర్, జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత సురేష్ పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసినారు. అనంతరం చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులను  సన్మానించి, పలు పాఠశాలలో నిర్వహించిన చేనేత  పోటీ లలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత గతంలో ఉన్న పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులు పద్మశాలి లు గమనించాలని అన్నారు. ఉద్యమం సమయంలో ఆకలి చావులు జరుగుతున్న సమయంలో సిరిసిల్ల లో 2002 సమయంలో మీటింగ్ ఏర్పాటు చేసి 50 లక్షల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి దైర్యం అందించిన ఘనత ముఖ్యమంత్రి ది అని అన్నారు. సహకార సంఘం భూమి పద్మశాలి లకు కేటాయించే విధంగా అవకాశాలను చూడాలని అధికారులను, సంగ సభ్యులను కోరారు. ఎమ్మెల్యే డా.సంజయ్ మాట్లాడుతూ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత బందు ముఖ్యమంత్రి ప్రకటన చేయటం ఆనందదాయకం అని అన్నారు. బతుకమ్మ చీరలు ప్రతి సం, కోటిన్నర చీరలు పవర్ లూమ్ 24 గంటల కరెంట్ ద్వారా లాభం చేకూరుతుందని చేనేత సహకార సంఘం లో వెయ్యి మంది ఉండేదని గత పాలకుల నిర్లక్ష్యం వల్ల 10 మందికి పరిమితం అయ్యారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో
జిల్లా కలెక్టర్ జి రవి, జిల్లా, పట్టణ పద్మశాలి అధ్యక్షులు రుద్ర శ్రీను, గౌరీ శ్రీనివాస్, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడి లక్ష్మి నారాయణ, పద్మశాలి సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.