కరెంట్ చార్జీలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ పెంపుతో సామాన్యుడి నడ్డి విరుస్తున్న ప్రభుత్వాలు

Published: Tuesday April 05, 2022
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 4 ప్రజాపాలన ప్రతినిది : ధరల పెంపును నిరసిస్తూ ఇబ్రహీంపట్నం చౌరస్తా లో సోమవారం ఉదయం నరేంద్రమోడీ, కేసీఆర్ ల దిష్టిబొమ్మ లను దగ్ధం చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.. ధరలు తగ్గించేదాక పోరాటం ఆగదు - కాంగ్రెస్ పార్టీ యువనాయకులు చిలుక మధుసూదన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయి అనుకుంటే కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచి పేద ప్రజల నడ్డి విరిచేలా చేసిందని ఆరోపించారు.. ప్రజల పై భారం మోపిన చార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి రోజు పెంచుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి  పిలుపు మేరకు సోమవారం ఉదయం ఇబ్రహీంపట్నం చౌరస్తా లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్, మోడీ దిష్టిబొమ్మ లను దగ్దం చేసి, నిరసన తెలపడం జరిగింది.. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ యువనాయకులు చిలుక మధుసూధన్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకుందని, అధికార  టిఆర్ఎస్ పార్టీ నాయకులకు ధరల పెంపుదల కనిపించడం లేదా అని, బిజెపి టిఆర్ఎస్  ప్రభుత్వాలు నిరంతరం ధరలు పెంచుతూ ప్రజల జీవితాలతో చెలగాటం అడుతున్నాయని, దేశంలో నరేంద్రమోదీ గారు ప్రజల సొమ్మును దోచుకుంటు ఆదాని, అంబానిలకు దోచి పెడుతున్నారని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంద్ర దోపిడిదారులకు దోచి పెడుతున్నారని,  ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ లను తెలంగాణ ప్రజలంతా గమనిస్తున్నారని, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పెంచిన ధరలను తగ్గించాలని, లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించడం జరిగింది... ఇట్టి కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జడల రవీందర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి కొండ్రు ప్రవీణ్, కౌన్సిలర్లు ఆకుల మమతానందు, మోహన్ నాయక్, విశాల్ సాగర్ తో పాటు సీనియర్ నాయకులు పెద్దిగారి శ్రీకాంత్, యాదగిరి, చొప్పరి రవికుమార్, రాజశేఖర్ రెడ్డి, భరత్ రెడ్డి, నవనీత్  ఎన్ ఎస్ యు ఐ  నందు, మహేందర్ గౌడ్, కిరణ్, గుడ్ల.అర్జున్, శివకుమార్, రవికుమార్, లింగం గౌడ్, నాని, సుధాకర్ తో పాటు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.