డిల్లీ లో మాల మహానాడు మహా ధర్నా

Published: Tuesday November 02, 2021
హైదరాబాద్ అక్టోబర్ 31 ప్రజాపాలన ప్రతినిధి : మహబూబ్ నగర్  జిల్లాలోని కారుకొండ గ్రామంలో మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు కావాలి రమేష్ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు శ్రీ చెన్నయ్య హాజరైనారు. చెన్నయ్య మాట్లాడుతూ నవంబర్ 24వ తేదీన వర్గీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో మహా ధర్నా నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణ 29 రాష్ట్రాల నుండి మాల మాల అనుబంధ సంఘాలు మాల మాల ఉపకులాలు ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద  నిర్వహించే ధర్నాలో దేశవ్యాప్తంగా మాలలకు మద్దతిచ్చే పార్టీలను మేము స్వాగతిస్తామన్నారు. బహుజన రాజ్యం కోసం బిసీ, ఎస్సీ ఎస్టీల ను కలుపుకొని ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి రిజర్వేషన్లు రాసినటువంటి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా మనువాద శక్తులన్ని మాల సామాజిక వర్గం పైనే వివక్షత చూపిస్తున్నాయి. 80 శాతం ఉన్నటువంటి ప్రజల చేతుల్లోకి రాజ్యాధికారం వెళ్లకుండా కుట్ర పన్నిన అగ్రవర్ణ రాజకీయ పార్టీలు దళిత గిరిజన బిసిల మధ్య చిచ్చుపెట్టి విభజించి పాలిస్తున్నాయి. దీనిని అర్థం చేసు కోలేని దళిత గిరిజనులు ఎవరి వాదనను వారు భుజాన వేసుకొని ఒకరిపై ఒకరు కుయుక్తులు పన్ని రాజకీయానికి దూరమవుతున్నారు. 2023 ఎలక్షన్లలో మాల మహానాడు రాజకీయ శక్తిగా ఎదిగపోతుందని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తాళ్లపల్లి రవి అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి ఎడ్ల కృష్ణయ్య, మహబూబ్ నగర్ జిల్లా ఉపాధ్యక్షులు నీరటిరాములు, నారాయణపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్ రాములు, రాష్ట్ర కార్యదర్శి కావాలి హనుమంతు, నవాబుపేట్ మండల అధ్యక్షులు బ్యాగరీ రమేష్, నవాబుపేట్ మండల ప్రధాన కార్యదర్శి పంబాల నందకిశోర్, బయ్యా వెంకటయ్య, దివాకర్ తదితరులు పాల్గొన్నారు.