ఇబ్రహీంపట్నం మార్చ్ తేదీ 8 ప్రజా పాలన ప్రతినిధి **మహిళా సోదరిమనులందరికి అంతర్జాతీయ మహిళా దిన

Published: Thursday March 09, 2023

ఇబ్రహీంపట్నం క్యాంపు కార్యాలయం లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని  ఏం ఎల్ ఎ కార్యాలయం లో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించి మహిళలతో కలిసి కేక్ కట్ చేశారు. మున్సిపాలిటీ మహిళా కౌన్సిలర్ లను పూల దండలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు మహిళలు అన్ని రంగాలలో రాణించేవిదంగా తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ప్రభుత్వ పతకాలను మహిళలు సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా రాణిస్తున్నారు అని అన్నారు. మారుతున్నా కాలాన్ని అనుగుణంగా అటు రాజకీయల్లో,ఇటూ ఉద్యోగాలల్లో,స్వయం ఉపాధిలో పురుషులకు దీటుగా రానిస్తూ తోటి మహిళలకు ఆదర్శనంగా నిలుస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చేర్మెన్ ఆకుల యాదగిరి  మహిళ అధ్యక్షులు నల్లబోలు మమత కౌన్సిలర్ లు నీలం శ్వేతా  యాచారం సుజాత  మహిళ నాయకులు పర్వీన్,నీలం కల్పనా,నిరుడు మాధవి,చంద్రకళ,మరియు మండల అధ్యక్షులు బుగ్గ రాములు   బీ ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులు నల్లబోలు శ్రీనివాస్ రెడ్డి  ముత్యల చిన్న  తదితరులు పాల్గొన్నారు..