బూత్ కమిటీ సభ్యులుకాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరం చేయండి : సూరంసెట్టి కిశ

Published: Thursday January 20, 2022
మధిర జనవరి 19 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో మండల కాంగ్రెస్ కార్యాలయంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరియు సిఎల్పి లీడర్ మధిర శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క ఆదేశానుసారం. కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత నమోదు కార్యక్రమం విజయవంతం చేయాలి అని మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరంసెట్టి కిషోర్ అన్నారు. ఈ రోజు మధిర మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మధిర మండలలోని గ్రామాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి బూత్ కమిటీ సభ్యులకు దిశ నిర్దేశం చేశారు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న సభ్యులకు ఒక రక్షణ కల్పించడం కోసం దేశంలో మొదటిసారి 2 లక్షల ప్రమాద భీమా కల్పిస్తుంది. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాలు తీసుకున్న వారికి ఇది ఒక రక్షణగా ఉంటుంది. పార్టీ లో చేరే వాళ్ళని కుటుంబ సభ్యులుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుందిసభ్యత్వ నమోదు కు ఒక ఐడి కార్డు ఇస్తున్నాంఇది వారికి గుర్తింపు కార్డు.. 30 లక్షల సభ్యత్వాలు లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. ప్రతి బూతులో 100 మంది సభ్యుల కు సభ్యత్వం ఇచ్చే ల చర్యలు తీసుకోవాలి అని. బూతులో ఉన్న ప్రతి ఎన్ రోలర్.. ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు గురించి వివరించి చెప్పాలి.. ఏ వయస్సు ఉన్న వారికైనా సభ్యత్వం ఉంటుంది.. అనిప్రతి బూత్ కమిటీ సభ్యుడు విధిగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం నమోదు చేయాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మధిర అ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చావా వేణు మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు దారా బాలరాజు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అద్దంకి రవికుమార్ పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జహంగీర్ పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు బిట్ర ఉద్దండయ్యా, కాంగ్రెస్ నాయకులు ఆదిమూలం శ్రీనివాసరావు మైలవరపు చక్రి మొదలగు వారు పాల్గొన్నారు