ఐసొలేషన్ కేంద్రాలకు ప్రజలు సహకరించాలి

Published: Tuesday May 25, 2021
పలుచోట్లా ఐసొలేషన్ సెంటర్లు ప్రారంభం
మండల అధికార్లు పర్యటన
మధిర ప్రజా పాలన ప్రతినిధి : 23వ తేదీ మధిర మండలంఈ రోజు తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలు మేరకు ఖమ్మం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పలు మండల్లాలో ఎవరికి వారు ఆయా గ్రామాల్లో ఉన్న హైస్కూల్ నందు గ్రామ సర్పంచ్ లు వైద్య సిబ్బంది సంయుక్తంగా హోమ్ ఐసొలేషన్ లో ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి mro D సైధులు గారు ఎంపీడీఓ విజయభాస్కర్ రెడ్డి గారు, రూరల్ SI రమేష్ గారు eord రాజారావు వైద్య అధికారులు dr వెంకటేష్ phc మాటూరుపేట  dr పుష్పలత బృందం దెందుకూరు ఖమ్మoపాడు, తొర్లపాడు నిదానపురం, మాటూరు, సిరిపురం, అతుకూరు గ్రామల్లో ఆయా సర్పంచ్ ల సహకారంతో డీ ఐసొలేషన్ సెంటర్లు ఏర్పాటు చేసినారు. ఈ ఐసొలేషన్ సెంటర్లుకూ గ్రామాల్లో ఐతే తేల్ల వాసు గారి బృందం, కర్లపూడి వాసు బాబు బృందం, మధిర పట్నంలో ఐతే శ్రీ మల్లాది సేవాసమితి. చేతన్ ఫౌండేషన్ వీనిగండ్ల బృందం గణేష్ కోల్డ్ స్టోరేజ్ బృందం ఉచితంగా అన్న దానం పంపిస్తున్నారు. ఈ సందర్బంగా Mro సైధులు ఎంపీడీఓ విజయభాస్కర్ రెడ్డి, రూరల్ SI రమేష్ గార్లు మాట్లాడుతూ ప్రజలు ఐసొలేషన్ సెంటర్ లకు సహకరించాలని కోవిడ్ కేసులు పెరగకుండ గ్రామoలో ఇంటి లో సదుపాయములేక ఇబ్బందులు పడే కోవిడ్ బాధితులుకు మంచి వసతి  ఉచిత భోజనo టిఫిన్, సిబ్బంది పర్యవేక్షణ, డాక్టర్స్ నర్సులు, చెకప్ లు, జి పి సిబ్బంది సేవలు తప్పక ఉంటాయని ప్రజా ప్రతినిధులు సహకరించాలని తెలిపినారు. అనంతరం దెందుకూరు సర్పంచ్ కోట విజయశాంతి వెంకట కృష్ణ దంపతులు ఆరోగ్యసిబ్బంది కీ జిపి సిబ్బంది కీ ఫేస్ షిల్డ్ లు, మాస్క్ లు S I, mro ఎంపీడీఓ చేతులు మీదుగా పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు దెందుకూరు కోటవిజయ శాంతి వెంకట కృష్ణ. ఖమ్మపాడు రూప్పినమ్మ తొర్లపాడు పింగళి శిరీష రెడ్డి, మాటూరు సర్పంచ్ మేడిశెట్టి లీలావతి నాగేశ్వరావు, అతుకూరు అబ్బూరి సంధ్యా రామకృష్ణ, సిరిపురం కనకపూడి బుచ్చయ్య, నిదనాపురం బాధకృష్ణ రెడ్డి మొదలగువారితో పాటు పోలీస్ శాఖ సిబ్బంది ఆరోగ్యపరివేక్ష కులు V భాస్కర్ రావు, లంకా కొండయ్య, Sir ఆతుకూరు సీనియర్ జిపి సెక్రటర్ శ్రీధర్ రెడ్డి, జి పి సెక్రటరీ హరి, కిరణ్, anm లు, ఆశ వర్కర్స్, GP మల్టిపర్పస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.