మున్సిపల్ కౌన్సిల్ సాదారణ సమావేశం జూమ్ కాన్ఫరెన్స్

Published: Tuesday June 01, 2021
మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణి
పలు అంశాలపై తీర్మానం సభ్యులు ఆమోదం
జగిత్యాల, మే 31 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల మున్సిపల్ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కోవిడ్ నిబంధనాలు పాటిస్తూ జూమ్ కాన్ఫెరెన్స్ మున్సిపల్ చైర్ పర్సన్ డా.బోగ శ్రావణి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ సాదారణ సమావేశం 4 అంశాలను ఆమోదించారు. ముఖ్యంగా నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనికి కేసీఆర్ నగర్ గా నామకరణం చేయుటకు సభ్యులందరు ఏకగ్రీవంగా ఆమోదించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టత్మకముగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి మున్సిపాలిటి యందు మొక్కలు అధిక సంఖ్యలో నాటించడమే లక్ష్యంగా 10 శాతం గ్రీన్ బడ్జెట్ తప్పనిసరిగా హరితహారం కార్యక్రమానికి వినియోగించాలని తెలిపారు. 2021-22 సంవత్సరంనకు జగిత్యాల పట్టణంలో అధిక సంఖ్యలో మొక్కలు నాటించి హరిత జగిత్యాలగా తీర్చిదిద్దాలని ట్రీ గార్డ్స్ కొనుగోలు ఎర్ర మట్టి డిగ్గింగ్ పిట్టింగ్ వర్క్ మొక్కలు మొదలగు ముందస్తు ఏర్పాట్ల కోసం ఒక కోటి అరవై లక్షల రూపాయలు మంజూరి చేయడం జరిగిందని అన్నారు. కొత్త బస్ స్టాండ్ నుండి పార్క్ వరకు సెంట్రల్ మీడియన్ అభివృద్ధికై కొత్త బస్ స్టాండ్ నుండి నిజామాబాద్ రోడ్ మంచినీళ్ళభావి వరకు డివైడర్స్ పేయిటింగ్ 42 లక్షలకు మంజూరు ప్రస్తుత కరోనా కాలము దృష్ట్యా రాబోయే సీజనల్ కాలందృష్ట్యా పారిశుధ్య నిర్వహణకై బ్లీచింగ్ పౌడర్ సోడియం హైపో క్లోరైడ్ కొనుగోలుకై మంజూరుకు ఆమోదం తెలిపారు. 2 కోట్ల 12 లక్షల రూపాయలు అభివృద్ధి పనులకు ఆమోదం పొందగా జగిత్యాలకు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వము మెడికల్ కాలేజ్ మంజూరు చేసినందుకు సభ్యులు హర్షంవ్యక్తం చేశారు. చైర్ పర్సన్ శ్రావణి మాట్లాడుతూ జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అద్వర్యములో జగిత్యాల పట్టణంనకు 4500 డబుల్ బెడ్ రూం ఇండ్లు రాష్ట్ర ప్రభుత్వము మంజూరి చేసినందుకు ఈ కాలనికి కేసీఆర్ నగర్ గా ఏర్పటు చేయాలని కౌన్సిల్ సభ్యులందరు జగిత్యాల పట్టణ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో కమిషనర్ ఎ.మారుతి ప్రసాద్ వైస్ చైర్మెన్ గోలి శ్రీనివాస్ కౌన్సిల్ సభ్యులు కో-ఆప్షన్ సభ్యులు మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.