దెందుకూరులో ముమ్మరంగా టైఫాయిడ్ పరీక్షలు మధిర

Published: Friday July 29, 2022
రూరల్ జులై 27 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో గురువారం నాడు మండల పిహెచ్సి దెందుకూరు వైద్యులు డా.శశిధర్ ఆధ్వర్యంలో జిల్లా అధికారుల ఆదేశాలు మేరకు  పిహెచ్సి పరిధిలో ఉన్న హాస్టల్ వెల్ఫేర్ వర్కర్స్ మరియు ఐసిడిఎస్ వర్కర్స్ కు మరియు ప్రతి స్కూల్ మిడ్డే మీల్ సిబ్బంది కీ ప్రధానము గా సీజనల్ వ్యాధులు ఐన టైఫాయుడ్, ఇతర వైరల్ ఫీవర్స్ నిమిత్తం పారామెడికల్ సిబ్బంది ద్వారా వైద్యులు సూచనల మేరకు బ్లడ్ శాంపిల్ సేకరించి టీ హాబ్ వాహనం ద్వారా ఖమ్మం టి హాబ్ సెంటర్ కు బ్లడ్ శాంపిల్ పంపిస్తున్నారు. నిన్న 50 మంది కి ఈరోజు 32 మందికి రక్త నమూనాలు సేకరించి పంపినారు. అదే విధంగా చిరు వ్యాధులకు చికిత్స చేసి తగిన మందులు అందిస్తున్నారు. ఈ కార్యక్రమం లో ఆయా ఎరియా ఆరోగ్య సిబ్బంది సూపర్ వైజర్ బృందం మరియు ఎఎన్ఎమ్ లు ఆశ లు స్కూల్ హాస్టల్ సిబ్బందినీ మోటివేషన్ చేసి బ్లడ్ శాంపిల్ కు తరలిస్తూ ఉండగా పిహెచ్సి లో ల్యాబ్ టెక్ నీషయన్ స్టాఫ్ నర్స్ లు వచ్చిన సిబ్బందికీ రక్త పరిక్షలు సేకరించి నిల్వ చేసి టీ  హాబ్ వెహికల్ కు అందిస్తున్నారు ఇంకా మిగిలిన హాస్టల్ ఐసిడిఎస్ స్కూల్ వర్కర్స్ అందరూ తక్షణమే పిహెచ్సి సిహెచ్సి లకు వచ్చి బ్లడ్ శాంపిల్ ఇవ్వాలని వైద్యలు తెలియపరుస్తూన్నారు.