ఆదర్శ పాఠశాలలను ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలి

Published: Tuesday January 31, 2023
* వికారాబాద్ జిల్లా కలెక్టర్ కే నిఖిల
వికారాబాద్ బ్యూరో 30 జనవరి ప్రజా పాలన : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మనబడి మోడల్ పాఠశాలల పనులను రేపటి వరకు అన్ని హంగులతో  ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు. సోమవారం నవాబుపేట మండలంలోని మాదారం గ్రామంలో ఎంపికైన మోడల్ పాఠశాల పనుల పురోగతిని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలో ఎపికైన మన ఊరు మనబడి మోడల్ పాఠశాలలను త్వరలో ప్రారంభించుకో బోతున్నామని, పెండింగ్ పనులు అన్నింటిని  రేపటి వరకు పూర్తి చేసి అన్ని హంగులతో సిద్ధం చేయాలన్నారు.  ఈ సందర్భంగా పాఠశాలలో చేపట్టిన పనులను పరిశీలించారు.  తరగతి గదులు, మరుగుదొడ్లు, కిచెన్ షెడ్, హ్యాండ్ వాష్, ఫ్లోరింగ్, కలరింగ్ పనులను పరిశీలించారు.  పాఠశాల ఆవరణలో ఫ్లవర్ పార్ట్స్  ఏర్పాటు చేయాలని సూచించారు.  అవసరమైన గ్రీన్ చాక్ బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారిని రేణుకా దేవి, టీఎస్ ఈడబ్ల్యూఐడిసి డి ఈ రాజు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మండల స్పెషల్ ఆఫీసర్ నవీన్ చంద్ర, సర్పంచ్ అంజయ్య, ఎంఈఓ గోపాల్, ఎంపీఓ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.