ఓటరు నమోదు దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయాలి **

Published: Thursday December 15, 2022
రాష్ట్ర  ఎన్నికల అధికారి వికాస్ రాజ్ **
 
 ఆసిఫాబాద్ జిల్లా డిసెంబర్14 (ప్రజాపాలన,ప్రతినిధి) : 
నూతన ఓటరు నమోదు దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో ఓటరు నమోదుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఓటరు జాబితా సంక్లిప్త సవరణ కార్యక్రమం 2023 లో భాగంగా జనవరి, తొలి జాబితా రూపొందించే కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. నమోదు కొరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వివరాలను ఆన్లైన్ లో నమోదు చేయాలని, అదే విధంగా ఓటరు జాబితాలో తొలగింపుల కొరకు వచ్చిన దరఖాస్తులకు సంబంధించి నోటీసులు జారీ చేసి వివరాలు నిర్ధారణ చేసుకున్న తర్వాత జాబితా నుండి తొలగింపుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లు లేని స్పష్టమైన జాబితా తయారు చేయాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లాలోని రెండు నియోజకవర్గాల పరిధిలో నూతన ఓటరు నమోదు, పేరు, చిరునామా ఇతర వివరాల మార్పు, తొలగింపుల కొరకు అందిన దరఖాస్తులను గడువు లోగా క్షుణ్ణంగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. డూప్లికేట్ ఓటర్లకు నోటీసులు జారీ చేసి వివరాల తొలగింపునకు చర్యలు చేపట్టడంతో పాటు దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్ల ఓట్ల నమోదుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు.పరిధిలోని ఇంటింటికి వెళ్లి వివరాలు పరిశీలించి నమోదు చేసేలా చర్యలు చేపడుతున్నామని, పి.వి.టి.జి. ఓటర్ల నమోదుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం, రెవెన్యూ అధికారి రాజేశ్వర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.