ఉస్మానియా యూనివర్సిటీ మరియు సీతాఫల్ మండి కూడలిలో ట్రాఫిక్ జామ్

Published: Thursday November 18, 2021
హైదరాబాద్ 16 నవంబర్ ప్రజాపాలన ప్రతినిధి: నగరంలో వివిధ రకాల వాహనాలు సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. దీని వల్ల నగరంలో ట్రాఫిక్ అంతరాయం జరుగుతుంది. ట్రాఫిక్ పోలీసు అధికారులు నగరాల్లో ట్రాఫిక్ అంతరాయం ను నివారించడానికి అనేక ప్రయోగాలు చేసి ఎప్పటికి పూర్తి నివారణ సాధ్యం జరగడం లేదు. దీనికి వివిధ రకాల కారణాలు ఉన్నాయని చెప్పి వచ్చు. రోజు రోజుకు పెరుగుతున్న వాహనాలు, ఇరుకు రోడ్లు, అభివృద్ధి పేరుతో రోడ్డు, వంతెన నిర్మాణ పనులు.ఇంతే కాకుండా ఇతర డిపార్ట్మెంట్ పనులు విద్యుత్ శాఖ, శానిటేషన్, మంచినీటి సరఫరా, టెలిఫోన్ శాఖ, కేబుల్ టీవీ,గ్యాస్ లైన్... ఇలా చాంతాడంత లిస్ట్ తయారు అవుతుంది. ముఖ్యంగా ఉదయం సాయంత్రం ఆఫీసులకు వెళ్లే వారు వ్యాపార సంస్థలు స్కూళ్లు కాలేజీలకు వెళ్లే వారు వచ్చే వారి హడావుడి ఎక్కువగా ఉంటుంది. ఇంతటి బిజీ సమయంలో  డ్రైవింగ్ నేర్పించే వాహనాలతో ఉస్మానియా విశ్వవిద్యాలయం మరియు సీతాఫల్ మండి వెళ్లే కూడలిలో మంగళవారం నాటి సాయంత్రం ట్రాఫిక్ జామ్ కావడంతో కొద్ది సేపు వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రద్దీ వేళలో ట్రాఫిక్ జామ్ కావడంతో డ్రైవింగ్ స్కూల్ వాహన యజమానితో వాగ్వాదానికి దిగిన వివిధ వాహనదారులు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ సిబ్బందిని వాహన దారులు కోరుకుంటున్నారు.