అసాంఘిక కార్యకలాపలే లక్ష్యంగా దాడులు

Published: Wednesday March 23, 2022
జిల్లా ఎస్పి నంద్యాల కోటిరెడ్డి
వికారాబాద్ బ్యూరో 22 మార్చి ప్రజాపాలన : అసాంఘిక కార్యకలాపలే లక్ష్యంగా దాడులు నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పి నంద్యాల కోటిరెడ్డి అన్నారు. జిల్లాలోని టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు ఆక్రమార్కుల పైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. అందులో భాగంగానే మంగళవారం టాస్క్ ఫోర్స్ అధికారులు పలు చోట్ల దాడులు చేశారు. కరన్‌కోట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణపూర్ గ్రామ పరిధిలో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారు అనే పక్క సమాచారం తో దాడి చేయగా పేకాట ఆడుతున్న 17 మంది నుండి 10 బైక్‌లు, 15 సెల్ ఫోన్‌లు మరియు 7,660/- రూపాయల నగదు స్వాధీనం చేసుకొని కరణ్ కోట్ పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరిగింది. ఇట్టి వారిపైన పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయడం జరిగింది. తాండూర్ టౌన్ పోలీస్ స్టేషన్ మరియు వికారాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలలో గ్యాస్ అక్రమ రీఫిల్లింగ్‌ చేస్తున్నారు అనే పక్క సమాచారంతో నేడు దాడులు నిర్వహించగా అందుకుగాను ఉపయోగించే 09 అనుబంధ సిలిండర్లు మరియు 27 చిన్న సిలిండర్లు తాండూర్ టౌన్ లో లభించడం జరిగింది. ఇట్టి వారిపైన తాండూర్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. మరియు వికారాబాద్ టౌన్ లో దాడులు చేయగా గ్యాస్ అక్రమ రీఫిల్లింగ్‌ కోసం ఉపయోగించే 11 సిలిండర్ లను సీజ్ చేయడం జరిగింది. ఇట్టి వారిపైన వికారాబాద్ టౌన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. ఇట్టి టాస్క్ ఫోర్స్ టీమ్ కు మోమిన్ పేట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ వెంకటేశం ఇంచార్జ్ గా ఉన్నారు జిల్లా ప్రజలు ఏమైనా సమాచారం ఉంటే 9492009094 నెంబర్ కు సమాచారం అందించగలరని మనవి.