వీధుల నుంచి తోలగించారని వాటర్ ట్యాంక్ ఎక్కి పారిశుద్ధ్య కార్మికుడి నిరసన.

Published: Wednesday May 11, 2022
జన్నారం రూరల్, మే 10, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మహమ్మదాబాద్ గ్రామపంచాయతీలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికుడిని వీధుల్లో నుంచి తొలగించి మరో వ్యక్తిని నియమించారని ఆవేదన తో బాదిత కుటుంబ సభ్యులు (కోండ్ర రాజన్న కుటుంబ సభ్యులు)  మంగళవారం  స్థానిక మిషన్ భాగీరథ వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపారు., సమాచారం అందుకున్న స్థానిక ఎస్ఐ పి సతీష్ ఘటనా స్థలానికి చేరుకుని కోండ్ర రాజన్నతో మాట్లాడినా మిషన్ భాగీరథ వాటర్ ట్యాంక్ మీద నుండి క్రిందికి దిగి రావలని కోరారు, కోండ్ర రాజన్న మాట్లాడుతూ మహమ్మదాబాద్ గ్రామపంచాయతి సపాయిగా విధుల్లోకి తీసుకుంటేనే తప్ప మిషన్ భాగీరథ వాటర్ ట్యాంక్ మీద నుండి క్రిందకు దిగి రామని అయన కుటుంబ సభ్యులు స్థానిక ఎస్ఐ జన్నారం స్పష్టం చేశారు, జన్నారం మండలం మహమ్మదాబాద్ గ్రామంలో కొంత టెన్షన్ వాతావరణం నేలకోంది, ఈ ఆందోళనలో స్థానిక ఎస్ఐ పి.సతీష్, కోండ్ర రాజన్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులు, తదితరులు వున్నారు.