జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా..

Published: Wednesday August 03, 2022

మేడ్చల్ జిల్లా (ప్రజాపాలన ప్రతినిథి):

జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మైగూడలో ప్రధాన చౌరస్తాలో పెద్ద ఎత్తున ప్రజలు అందరు రోడ్డు పైకి వచ్చి డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని వ్యతిరేక నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. కొద్దిపాటి వర్షానికే డంపింగ్ యార్డ్ నుండి వచ్చే కలుషిత నీరు చెరువులో చేరి విషవాయువుగా మారి అంబేద్కర్ నగర్,దమ్మైగూడ ప్రజలకు అనేక రకాల ఇబ్బందిగా మారాయి. కొత్త రకపు చర్మవ్యాధులు, డంపింగ్ యార్డ్ నుండి వెలువడే కాలుష్య వాయువు వల్ల చిన్నపిల్లలకు జ్వరాలు రావడంతో అనారోగ్యానికి గురవుతున్నారు.జవహర్ నగర్, దమ్మైగూడ, నాగారం పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు శాపంగా మారిన డంపింగ్ యార్డ్ సమస్య పలుమార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు తెలియజేసిన ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. రామ్కీ సంస్థ లక్షల మంది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రశ్నించే వాళ్లే లేరు. రాంకీ సంస్థకి అధికార పార్టీ అండదండలు ఉండడంతో ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని తెలుసుకొని ప్రజలు రోడలపైకి పైకి వచ్చి భారీ ఎత్తున ధర్నా చేయడం జరిగింది. ప్రజలకు మద్దతుగా టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్, మేడ్చల్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి నేతృత్వంలో జవహర్ నగర్, దమ్మాయిగూడ, నాగారం, కీసర పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నాలో పాల్గొన్నారు.ధర్నా చేస్తున్న నాయకులను అరెస్టు చేసి జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

 

ఆందోళనలతో దిగివచ్చిన డంపింగ్ యార్డ్ యాజమాన్యం సత్వర పరిష్కారం కోసం వారం రోజులలో మురికినీరు కాలనీలలోకి ప్రవేశించకుండా చేస్తామని హామీ ఇచ్చిన డంపింగ్ యార్డ్ యాజమాన్యం.డంపింగ్ యార్డ్ యాజమాన్యం హామీతో తాత్కాలికంగా ఆందోళనలు విరమించిన ప్రజలు. ధర్నా విరమించడంతో పోలీస్ స్టేషన్ నుండి నాయకులను విడుదల చేసిన పోలీసులు.

 

ఈ కార్యక్రమాలలో హరివర్ధన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ తరఫున దమ్మాయిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పా రామారావు, జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్,జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి గోగుల సరిత వెంకటేష్,దమ్మాయిగూడ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ వరగంటి వెంకటేష్, మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి ఏనుగు సంజీవరెడ్డి,బండ కింది ప్రసాద్ గౌడ్, దమ్మాయిగూడ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సామల శ్రీనివాస్ రెడ్డి, జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొత్తకొండ వేణు,దమ్మాయిగూడ, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సుమేష్, జవహర్ నగర్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వినయ్,జవహర్ నగర్ కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలు బద్దినేని అనంతలక్ష్మి,శోభారాణి,ఈగ శ్వేత, గజ్వేల్ శంకర్, బాల్ రెడ్డి, తిమ్మాయిపల్లి సురేష్, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు.