గిరిజన రిజర్వేషన్ జివో ప్రకటించడం హర్షనీయం: గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గుగులోత్ పంతు

Published: Wednesday September 21, 2022

బోనకల్, సెప్టెంబర్ 21 ప్రజా పాలన ప్రతినిధి: బంజారభవన్ ప్రారంబోత్సవ కార్యక్రమంలో సీఎం కెసిఅర్ గిరిజనులకు 10% శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జివో జారీ చేస్తామని ప్రకటించడం హర్షణీయం అన్ని గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గుగులోతు.పంతులు అన్నారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు.అధేవిధంగా కేంద్ర ప్రభుత్వం జీవో కు చట్టబద్ధత కల్పించాలని రాజ్యాంగ లోని 9వ షెడ్యూల్ లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రయివేటు రంగంలో సైతం రిజర్వేషన్ కల్పించాలని, న్యాయపరమైన అడ్డంకులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరన చూపాలని అన్నారు.గిరిజన బంధు అమలు చేయాలని కోరారు.మునుగోడు ఎన్నికల్లో టిఆర్ఎస్ కు సిపిఎం మద్దతు ప్రకటించేటప్పఢు ముఖ్యమంత్రి తో చర్చించిన డిమాండ్ లో 10% శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జివో జారీ చేయాలని డిమాండ్ పెట్టిన సిపిఎం రాష్ట్ర కమిటీ కి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని.వీరబధ్రంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల అధ్యక్షులు భూక్యా శీను, మండల కార్యదర్శి అజ్మీరా గోపి, వార్డు నెంబర్ లావూరి వెంకటేశ్వర్లు, భానోత్ నాగేశ్వరరావు, సైదులు, నరేష్ , సింగ్యా, స్వామి, బానోతు గోపి, మాన్యా నాయక్ , సేవ్య ,మహిళా నాయకురాలు గూగులోత్ శారద, గుగులోతు హాసిలి, బుజ్జి, గిరిజన సంఘం మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.