ప్రజాపాలన దిన పత్రికలో ప్రచురించిన వార్త స్పందించిన బల్దియా

Published: Thursday July 01, 2021
తార్నాక, జూన్ 30 ప్రజాపాలన : "సా...గుతున్న నాలా పనులు" జూన్ 8 ప్రజాపాలన దిన పత్రికలో ప్రచురించిన వార్త స్పందించిన బల్దియా. తార్నాక రోడ్ నెంబర్-2 కీ మత్ నగర్ కాలనీ, సామ్ సంగ్ సర్వీస్ సెంటర్ రోడ్డు లోని మురుగు నీరు నాలా నిర్మాణ పనులను పాక్షికంగా చేసి గాలికి వదిలేశారు. అనే వార్త తో స్పందించిన అధికారులు నాలా పనులు తిరిగి ప్రారంభించారు. నిత్యం రద్దీగా ఉండే దారి విజయ్ డైరీ, కె పాల్. ఎముకల దవాఖాన, మార్కెట్ కు వెళ్లేవారు ఇబ్బందులకు గురవుతున్నారు. త్వరలోనే నాలా పనులు పూర్తి అవుతాయని కాలనీ వాసులు సంతోషం వెలిబుచ్చారు.. పత్రికకు, సంబంధిత అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.