పరిగి నుండి సమీకృత కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర

Published: Thursday February 23, 2023
* జిల్లా వైఎస్ ఆర్ టిపి అధికార ప్రతినిధి కావలి వసంత్ కుమార్
వికారాబాద్ బ్యూరో 22 ఫిబ్రవరి ప్రజాపాలన : రైతుల సమస్యలను బిఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యం చేస్తుందని జిల్లా వైఎస్సార్ టిపి అధికార ప్రతినిధి కావలి వసంత్ కుమార్ విమర్శించారు. ప్రజాపాలన బ్యూరో రిపోర్టర్ తో ఆయన మాట్లాడుతూ పరిగి పట్టణంలోని బిఆర్ అంబెడ్కర్ విగ్రహం నుండి సమీకృత కలెక్టరేట్ కార్యాలయం వరకు పరిగి నియోజకవర్గ కో ఆర్డినేటర్లు కోళ్ళ యాదయ్య, కోస్గి నరేందర్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 10 గంటలకు పాదయాత్రతో కదిలి వచ్చి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేయనున్నారు. వైఎస్సార్ అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాదయాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ధరణి పోర్టల్ తో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పిన కెసిఆర్ కు బుద్ధి చెప్పాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. నిరుపేదలకు ఇంతవరకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించలేదన్నారు. రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. దళిత బంధు నిరుపేదలకు అందేలా కృషి చేయాలని కోరారు.