విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి యుటిఎఫ్ ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా

Published: Wednesday June 29, 2022

బోనకల్, జూన్ 28 ప్రజా పాలన ప్రతినిధి: పాఠశాల విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ  తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో  స్థానిక మండల పరిషత్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎస్ యూటీఎఫ్ జిల్లా కోశాధికారి వల్లంకొండ.రాంబాబు మాట్లాడుతూ ఉపాధ్యాయుల ఖాళీలను విద్యా వలంటీర్లతో నైనా భర్తీ చేయాలని, పండిట్ పిఇటి అప్రగేఢేషన్  చేయాలని, కేజీబీవీ గురుకుల ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని, విద్యార్థులకు వెంటనే పాఠ్య పుస్తకాలు, యూనిఫాం ఇవ్వడంతో పాటు పారిశుద్ధ్య కార్మికు లను తక్షణమే నియమించాలని, మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లులు వెంటనే చెల్లించాలని, ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు ఎస్ఎంసీ చైర్మన్లు, ఉపాధ్యాయులు సీఎంకు లేఖలు రాయడం, మెయిల్స్ పంపడం జరిగిందని అన్నారు. సమస్యలు పరిష్కారం కాక పోతే జులై 1న జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించ నున్నట్లు తెలిపారు. అలాగే, 317 జీఓ వల్ల ఏర్ప డిన సమస్యలను పరిష్కరించాలని, 13 జిల్లాల్లో నిలుపుదల చేసిన స్పౌజ్ బదిలీలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. సీఎం హామీ మేరకు బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని అన్నారు. ఉపా ధ్యాయుల సమస్యలు పరిష్కారం కాని పక్షంలో  జూలై 7న హైదరాబాద్ లో ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. ర్యాలీ అనంతరం డిప్యూటీ తాసిల్దార్ శ్వేత, ఆర్ ఐ లక్ష్మణ్ కు వినతి పత్రం అందజేశారు.అదేవిధంగా ఈ ధర్నాకు ప్రతిపక్ష నాయకులు , కార్మిక సంఘాల నాయకులు, సంఘీభావం తెలిపారు. ఈ  కార్యక్రమంలో యు టి ఎఫ్ మండల అధ్యక్షుడు బి. ప్రీతం, మండల ప్రధాన కార్యదర్శి గుగులోతు రామకృష్ణ, మండల కార్యదర్శులు ఎంసీఆర్ చంద్రప్రసాద్, పీనరసింహారావు, పి గోపాల్ రావు, కే సౌ భాగ్యలక్ష్మి, లెవిన్ ,సద్దాబాబు, జల్లా కోటయ్య , చిన్న రంగారావు, మాధవరావు, టి లక్ష్మి, రాణి , శశి కుమార్ , చాంద్ పాషా, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గాలి దుర్గారావు, సిపిఐ నాయకులు పవన్, అమర్నాథ్, సిఐటియు నాయకులు ఇవి అప్పారావు, అప్పాచారి, కుక్కల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.