అంబరాన్నంటిన రైతుబందు సంబరాలు...

Published: Monday January 10, 2022

బీరుపూర్, జనవరి 09 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ మండల్ మంగేల గ్రామంలో రైతుబందు సంబరాలు అంబరాన్నంటాయి. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన రైతుబందు పథకం ఎకరానికి 10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందడంతో జనవరి 10 వరకు 50 వేల కోట్ల రూపాయలకు చేరడంతో గ్రామంలో స్థానిక సర్పంచ్ సుంచు శారదనరేందర్ ఆధ్వర్యంలో రైతులు ఉపయోగించే నాగళ్ళు దుక్కిదున్నే ఎడ్లు తదితర చిత్రాలతో రైతులు గ్రామస్తులు కూడలి ప్రాంతాలలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు చేసుకున్నారు.