పీర్జాదిగూడను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే ద్వేయం : మేయర్ జక్క వెంకట్ రెడ్డి

Published: Monday July 05, 2021
మేడిపల్లి, జూలై 4 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే ద్వేయంగా, ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టు నగర మేయర్ జక్కా వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.పట్టణ ప్రగతి కార్యక్రమంలో పీర్జాదిగూడ రూపురేఖలు మారాయని ప్రతి డివిజన్లో పిచ్చి మొక్కల తొలగింపు, రోడ్లు మరియు డ్రైనేజీ క్లీనింగ్, కాలీ ప్లాట్లలో చెత్త తొలగించుట, విద్యుత్ దీపాల పరివేక్షణ, నాళాల శుభ్రత మొదలగు పనులతో పీర్జాదిగూడ కార్పొరేషన్ మొత్తం సర్వాంగ సుందరంగా మారుతుందని అదేవిదంగా హరితహారం కార్యక్రమంలో పట్టణంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి వారిని పరిరక్షించడంతో ప్రస్తుతానికి చాలా కాలనీలలో పచ్చదనంతో కళకళలాడుతున్నవాని పట్టణ ప్రగతి మరియు హరితహారం కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని మేయర్ జక్క వెంకట్ రెడ్డి తెలిపారు. పట్టణ పరిధిలో స్థానిక కార్పొరేటర్ల ఆధ్వర్యంలో 7వ డివిజన్, 25డివిజన్ మరియు 22వ డివిజన్లలో నిర్వహించిన పట్టణ ప్రగతి మరియు హరితహారం కార్యక్రమం, వార్డు కమిటీ సమావేశంలో ముఖ్య అతిథులుగా మేయర్ జక్క వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్  పాల్గొన్నారు. వివిధ కాలనీల అధ్యక్ష కార్యదర్శులు, సీనియర్ సిటిజన్స్, యువకులు, మేధావులు మహిళల కమిటీల సభ్యులతో డివిజన్లలో ఉన్నటువంటి సమస్యలు గురుంచి తెలియచేసి మరియు డివిజన్ అభివృద్ధి కోసం వారి సలహాలు సూచనలు తీసుకున్నారు, ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలి కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రగతి ప్రత్యేక అధికారి లింగస్వామి, కార్పొరేటర్లు మాడుగుల చంద్రకళ, దొంతిరి హరిశంకర్ రెడ్డి, భీంరెడ్డి నవీన్ రెడ్డి, ఎలక్ట్రికల్ ఏఈ శ్రీనివాస్ రెడ్డి, శానిటేషన్ ఇన్ స్పెక్టర్ జగన్మోహన్, నాయకులు మాడుగుల చంద్రా రెడ్డి, కోటగిరి శ్రీకాంత్ గౌడ్, అనిల్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.