బి సి భవన్ ఎక్కడ..?

Published: Monday September 19, 2022
బీసీ సంఘాల ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ గుమ్ముల శ్రీనివాస్,
మంచిర్యాల టౌన్, సెప్టెంబర్ 18, ప్రజాపాలన: బి సి భవన్ ఎక్కడ అని బీసీ సంఘాల ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ గుమ్ముల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆదివారం

మంచిర్యాల పట్టణంలో ని బెల్లంపల్లి చౌరస్తా దగ్గర బి సి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశం లో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలో వచ్చిన తర్వాత హైదరాబాదులో  బి సి లకు పది ఎకరాల స్థలంలో, 100 కోట్ల రూపాయలతో మహాత్మ జ్యోతిరావు పూలే శృతి వనం ఏర్పాటు చేస్తామని, ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చి  సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ హామీని నిలబెట్టు కోవడంలో నిర్లక్ష్య    చేస్తున్నారని అన్నారు. కెసిఆర్ ఆదివాసీ భవన్   కేటాయించడం స్వాగతిస్తున్నాం, బి సి లకు ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలనీ డిమాండ్ చేశారు. లేని యెడల పలు ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో   ప్రజా సంఘాల జిల్లా కన్వీనర్ జైపాల్ సింగ్, నాయకులు వడ్డేపల్లి మనోహర్, నవీన్, చంద్ర కిరణ్,గోపాల్, మల్లేష్, అంజన్న, వెంకీ,చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.