మమ్మదాన్ పల్లి గ్రామాభివృద్ధే లక్ష్యం

Published: Monday June 06, 2022
సర్పంచ్ పద్మమ్మ శ్రీనివాస్ ముదిరాజ్
వికారాబాద్ బ్యూరో 03 జూన్ ప్రజాపాలన : గ్రామాభివృద్ధే ప్రథమ లక్ష్యంగా కృషి చేస్తున్నామని మమ్మదాన్ పల్లి గ్రామ సర్పంచ్ పద్మమ్మ శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. ఆదివారం నవాబుపేట మండల పరిధిలోని మమ్మదాన్ పల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ పద్మమ్మ శ్రీనివాస్ ముదిరాజ్ పంచాయతీ కార్యదర్శి స్వప్న ఏపిఎం గ్రామ ప్రత్యేక అధికారి మంజులవాణిలు ఐదవ విడత పల్లె ప్రగతిలో భాగంగా శ్రమదానం కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గల్లి గల్లి తిరిగి ప్రజలకు తడి పొడి చెత్త గురించి అవగాహన కల్పించామని పేర్కొన్నారు. ప్రతి గల్లీ ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మోరీలలో చెత్తాచెదారం వేయరాదని స్పష్టం చేశారు. తడి పొడి చెత్తను వేరు వేరుగా గ్రామ పారిశుద్ధ్య కార్మికులకు అందజేయాలని వెల్లడించారు. ఓడిఎఫ్ గ్రామంగా తీర్చిదిద్దుటకు అహర్నిశలు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని హితవు పలికారు. గ్రామంలో ఏ సమస్య వచ్చినా వెంటనే నా దృష్టికి తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లలిత కుమారి డిఆర్డిఎ నర్సింలు డిపిఎం రామ్మూర్తి పంచాయతీ సిబ్బంది గ్రామస్తులు ఉన్నారు.