రహదారి అభివృద్ధిలో నష్టపోయిన బాధితులను ఆదుకోవాలి

Published: Monday July 12, 2021

ఇండియా ప్రజాబంధు పార్టీ రాష్ట్ర  ఉపాధ్యక్షులు రాజు ప్రకాష్.
మంచిర్యాల జిల్లా ప్రతినిధి, జూలై11, ప్రజాపాలన : 363 వ జాతీయ రహదారి అభివృద్ధి పనుల్లో ఇండ్లు, ఇండ్ల స్థలాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఇండియా ప్రజాబంధు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజు ప్రకాష్ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి జిఎం కార్యాలయం నుంచి మహారాష్ట్ర చంద్రాపూర్ వరకు 363 నెంబర్ జాతీయ రహదారిని నిర్మిస్తున్నారని తెలిపారు. కొత్తగా నిర్మిస్తున్న ఈ జాతీయ రహదారి లో వందలాది కుటుంబాలు ఇండ్లు కోల్పోయి వీధిన పడ్డారని అన్నారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించకుండానే వారిని ఎల్లగొట్టెందుకు జిల్లా అధికారులు ఒత్తిడి చేస్తున్నారని విమర్శించారు. నలభై, యాభై సంవత్సరాలుగా ఇక్కడే ఉండి జీవనం కొనసాగిస్తున్నా స్థానికులను రహాదారి నిర్మాణం పేరుతో బయటకు పంపించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. అయితే స్థానిక నాయకులు పట్టించుకోకపోగా అధికారులు అధికార పార్టీ కి చెందిన బాధితులను మాత్రమే గుర్తించి, వారి ఇల్లు, ఇడ్ల స్థలాలు  మాత్రమే సర్వేలు చేసి నష్ట పరిహారం చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. నష్టం జరిగినప్పుడు రాజకీయాలకతీతంగా బాధితులందరికీ ఒకే న్యాయం జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి బాధిత కుటుంబానికి పది లక్షల రూపాయల తో పాలు ఐదు గుంటల ఇండ్ల స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. అధికారుల అలసత్వం వహించి, అధికార పార్టీ నాయకులు ఏకపక్ష నిర్ణయం తీసుకుంటే బాధితులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.