సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి

Published: Tuesday July 26, 2022
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో 25 జూలై ప్రజా పాలన :  జిల్లాలో డెంగ్యూ ,  మలేరియా,  సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో డెంగ్యూ మలేరియా సీజనల్ వ్యాధులు, రెసిడెన్షియల్ పాఠశాలలో హాస్టల్లో ఆహార భద్రత , కోవిడ్ టీకా మరియు బూస్టర్ డోస్ వేసేందుకు తగు చర్లపై మండల ప్రత్యేక అధికారులు,  మునిసిపల్ కమిషనర్లు  ఎంపీడీవోలు, ఎంపీఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం ప్రజల ఆరోగ్య పట్ల ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని దీనికి సంబంధించి ఇంటింటి సర్వే నిర్వహించి జ్వరాల బారిన పడిన వ్యక్తులను గుర్తించి వైద్య సేవలు అందించాలని కలెక్టర్ తెలిపారు. గ్రామాల్లో ఆరోగ్య మరియు పారిశుద్ధ్య కమిటీ ఏర్పాటు చేసి ప్రజలకు సీజనల్ వ్యాధుల పట్ల పారిశుద్ధంపై అవగాహన కల్పించేందుకు పూనుకోవాలని కలెక్టర్ సూచించారు గ్రామస్థాయిలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి , ఏఎన్ఎం,  ఆశా, అంగన్వాడి వర్కర్లు,   వార్డు సభ్యులతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులతో కలిపి గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి సమన్వయంతో పని చేయాలన్నారు. అదేవిధంగా మండల స్థాయిలో ప్రత్యేక అధికారి,  ఎంపీడీవో  ఎంపీవో ,  ఏపీవో, సూపరిండెంట్ స్థాయి అధికారులతో కలిపి కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కలెక్టర్ సంబంధించి అధికారులకు ఆదేశించారు. గ్రామ మండల స్థాయిలలో ఏర్పాటుచేసిన ఆరోగ్యం మరియు పారిశుద్ధ కమిటీలు మంగళవారం( రేపు) నుండి ఉదయం ఎనిమిది గంటల  నుండి గ్రామాలను సందర్శించి వచ్చే పట్టేసిన పనులను ఐదు రోజుల్లో పూర్తి కావాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామాల్లో కమిటీ సభ్యులు ప్రతి ఇంటిని సందర్శించి ప్రజల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ పారిశుద్ధ్య పనులు,  పైపు లైన్ల లీకేజీలు , ఉపరితల ట్యాంకుల వద్ద నీరు నిలవకుండా ఉండకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ట్యాంకులను ప్రతినెల మూడు రోజులు శుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలి అన్నారు. గ్రామపంచాయతీలలోని మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా, ఆయిల్ బాల్స్ , మోతాదు మేరకు బ్లీచింగ్ పౌడర్ వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్లపైన గుంతల్లో  నీరు నిలవకుండా మట్టితో పూచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డే గా పాటిస్తూనే  ఆదివారం ప్రతి ఇంటిని,  పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. గ్రామాల్లో ఇంటింటి సర్వే  చేస్తున్న వైద్య సిబ్బంది కోవిడ్ వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తయ్యేలా చూడాలన్నారు. అదేవిధంగా ప్రజల ఆరోగ్యం అవగాహన కల్పిస్తూ ప్రస్తుత సమయంలో  కాచి మరగబెట్టిన నీరును త్రాగాలని సూచించాలన్నారు. గ్రామ పంచాయితీలు గ్రీన్ బడ్జెట్ లో నాటే ప్రక్రియతో పాటు గ్రామాల్లో శానిటేషన్ అప్పటిను చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీ పరిధిలో మున్సిపాలిటీ పరిధిలో కూడా ఆరోగ్య మరియు పారిశుధ్య కమిటీలను ఏర్పాటు చేసి ప్రతి వార్డులో పారిశుద్ధ్య పనులు చేపడుతూ.. చెత్తాచెదారం లేకుండా పిచ్చి మొక్కలను తొలగించాలని కమిషనర్ సూచించారు. శానిటేషన్ పనులు చేపడుతూనే వ్యాక్సినేషన్ చేసిన ప్రక్రియను కూడా పూర్తి చేయాలన్నారు. ప్రత్యేక అధికారులు కమిటీ సభ్యులతో కలిసి సమస్యల పరిష్కారాన్ని కృషి చేయాలని అన్నారు..సమీక్ష సమావేశంలో జడ్పీ సీఈవో జానకి రెడ్డి, ఇన్చార్జి డిఆర్ఓ విజయకుమారి,  డిఎంహెచ్వో తుకారం, డిపిఓ మల్లారెడ్డి , గిరిజన అభివృద్ధి అధికారి కోటాజి,  షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి మల్లేశం, బీసీ అభివృద్ధి అధికారి ఉపేందర్ ,  ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.