ఎస్సి వసతి గృహాలకు మౌళిక వసతులు

Published: Wednesday March 16, 2022
జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్
వికారాబాద్ బ్యూరో 15 మార్చి ప్రజాపాలన : జిల్లాలోని ప్రభుత్వ ఎస్సి వసతి గృహాలలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కొరకు క్రూషియల్ వెల్ఫేర్ నిధులతో ఈ ఆర్థిక మాసాంతం వరకు అవసరమైన పనులను చేపట్టి పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో ఎస్సి హాస్టల్ వెల్ఫేర్ అధికారులతో హాస్టల్ ల నిర్వహణ, మౌలిక వసతులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ సమీక్షిస్తూ, జిల్లాలోని 21 యస్సి వసతి గృహలకు అవసరమైన మరమ్మతుల పనులను చేపట్టి వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యంగా తలుపులు, కిటికీల మరమ్మతులతో పాటు పారిశుద్ధ్యముు, విద్యుత్, నీటి సదుపాయం, కలరింగ్ లాంటి పనులను అందుబాటులో ఉన్న క్రూషియల్ వెల్ఫేర్ నిధులతో ఈ ఆర్థిక మాసాంతం వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. నిరూపయోగంగా ఉన్న బోర్ లకు మరమ్మత్తులు చేపట్టాలని, దానితో పాటు ప్రతి వసతి గృహానికి మిషన్ భగీరథ నీటి సదుపాయం కల్పించాలని అధికారులను సూచించారు. ప్రతి హాస్టల్ కు ఒక సంప్ లేదా ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించాలన్నారు. ఇంజనీరింగ్ అధికారులు ఇట్టి పనులను వేగవంతం చేసి ఈ మాసాంతం వరకు పూర్తి చేయాలన్నారు. ఎస్సి కళాశాల విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల మంజూరు కొరకు సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్స్ నుండి వెంటనే దరఖాస్తులను తెప్పించుకొని ఉపకార వేతనములు మంజూరు చేయాలని జిల్లా ఎస్సి అభివృద్ధి అధికారిణి ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి మల్లేశం, మిషన్ భగీరథ ఈఈ బాబు శ్రీనివాస్, టిఎస్ డబ్ల్యూఐడిసి డిఈ రాజు, ఎఈ లు, జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి శంకర్ నాయక్, హాస్టల్ వార్డెన్లు తదితరులు పాల్గొన్నారు.