గ్రామ అభివృద్ధికి నడుం బిగించిన యువ నాయకుడు: ఆళ్ల మోహన్ రావు

Published: Thursday October 07, 2021
బోనకల్, అక్టోబర్ 06, ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలోని పెద్ద బీరవెల్లి గ్రామంలో వాళ్ల మోహన్ రావు అనే యువకుడు గ్రామంలోఎవరో వస్తారు, ఎదో చేస్తారని ఎదురుచూడకుండా తను స్వయంగా తన సొంత ఖర్చులతో గ్రామంలో ఒక్కో సమస్య పరిష్కరా దిశగా నడుంబిగించి తనదైన శైలిలో గ్రామ ప్రజలు తనని సంప్రదించగానే పని చేసి పెడుతూ పలువురి మన్నలు పొందుతున్నాడు. గ్రామ వాసిఅయినా ఆళ్ల మోహన్ రావు స్థానిక  పెద్దబీరవల్లి గ్రామంలో రైతులు గతంలో వైరా, మధిర వైపుగా ప్రయాణం చేయాలన్నా, తమ పొలాలకు వెళ్లాల్సి వచ్చిన జానకిపురం మీదుగా తిరిగి రావాల్సి ఉండేది. ఏళ్ల తరబడి ఉన్న ఆ గ్రామ సమస్యను పెద్దలు, రైతులు కూర్చుకొని మాట్లాడుకుని ఈశాన్య రోడ్డు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుని రైతులు స్వచ్ఛందగా తమ భూములను ఇచ్చి, కొంత మేర ఖర్చు చేసి ఏర్పాటు చేసుకున్నారు. గత రెండు మూడు సంవత్సరాలుగా ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు వచ్చిన వరద ధాటికి మెటల్ రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయి గుంతలు మయంగా మారడంతో ప్రయాణికులుకు తీవ్ర ఇబ్బందులు కలగడంతో గ్రామ ప్రజలు,పంచాయతీ కార్యదర్శి కోటేశ్వరరావు, ఆళ్ల మోహన్ రావును సంప్రదించి మరమ్మత్తులు చేపట్టాలని కోరారు. తను స్పందించి వెంటనే బుధవారం జేసీబీ ఏర్పాటు చేసి రోడ్డు యొక్క సైడ్ డ్రైన్లు పూడిక తీసి గుంతలు పూడ్చి వేసే కార్యక్రమాన్నీ గ్రామ సర్పంచ్ ఆళ్ల పుల్లమ్మ, పంచాయతీ కార్యదర్శి జి.కోటేశ్వరరావు ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాట్లాడుతూ అధికారులు ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకొని సీసీ రోడ్డు మంజూరు చేసి రైతుల కష్టాలు తీర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో యనమద్ది నాగేశ్వరరావు, ఆళ్ల ప్రసాద్, నాగటి లక్ష్మీనారాయణ, యువకులు ఆళ్ల మురళి, పంది రామారావు, భోగి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.