ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి తేదీ 22ప్రజాపాలన ప్రతినిధి **31 రోజుకు చేరుకున్న పాదయాత్ర బ్రహ్మరథం పడు

Published: Thursday February 23, 2023

*కన్నతల్లి ఒడిలోకి చేరినంత ఆనందంగా ఉందంటూ బావోద్వేగానికి లోనైన బంటి
*గ్రామంలో పాదయాత్ర చేస్తూ చిన్ననాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
*రాష్ట్రానికి ఏం కావాలో కేసీఆర్ కు తెలుసు, గ్రామాలకు ఏం కావాలో కిషన్ రెడ్డికి తెలుసు.
* మీకు ఎలాంటి కష్టమొచ్చినా సహయం కావాలన్నా నేను అండగా ఉంటాను.
* మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి (బంటి

ప్రగతి నివేదన యాత్రలో భాగంగా 31వ రోజు మంగళవారం  బీఆర్ఎస్ పార్టీ యువనాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి (బంటి)  ఇబ్రహీంపట్నం మండలం, ఎలిమినేడు గ్రామంలోని ప్రతి గడప గడపకు తిరుగుతూ ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ధి పనులను వివరిస్తూ, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఎలిమినేడు గ్రామ చౌరస్తాలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి బంటి మాట్లాడుతూ జనవరి 22న నందివనపర్తి గ్రామంలో ఆనందీశ్వరుని ఆశీస్సులు తీసుకొని ఇప్పటివరకు 2 మండలాలు, 31రోజులు, 55 గ్రామాలు, 415కిలోమీటర్లు పూర్తి చేసుకొని ఎక్కడికక్కడ సమస్యలు తెలుసుకుంటున్నాను అని అన్నారు. ఒక వ్యక్తికి ఒకే రోజు 3పండగలు వస్తే ఎంత సంతోషంగా ఉంటుందో నాకు అంతకన్నా ఎక్కువ సంతోషంగా, ఆనందంగా ఉందన్నారు. నన్ను ఈప్రపంచానికి పరిచయం చేసిన మా అమ్మ ముకుందమ్మ గారికి నాహృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా నాభవిష్యత్తు నాకూతురు మహన్వి కి జన్మదిన శుభాకాంక్షలు అని తెలిపారు. ఒక చంటిపిల్లవాడు తన తల్లి ఒడిలోకి చేరినప్పుడు ఎంత ఆనంద పడతాడో నాకు కూడా మాసొంతూరు ఎలిమినేడులోకి ప్రవేశించినప్పుడు అంతకన్నా రెట్టింపు సంతోషంగా, ఆనందంగా ఉందంటూ ఉన్న ఊరు, కన్నతల్లిని తలచుకొని బావోద్వేగానికి లోనయ్యారు.ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్  ఏర్పుల చంద్రయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణా రెడ్డి, జెడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ, ఎంపీపీ నర్మదా, పీఎసీఎస్ చైర్మన్ మహేందర్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, అశోక్ రెడ్డి, పుట్టి రాములు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు బీవైఎఫ్ సభ్యులు పాల్గొన్నారు.