*సిపిఐ పార్టీ పేదల కష్టాలను తీర్చి సామాజిక లక్ష్యం వైపు నడిచే పార్టీ* -భూ పోరాట కేంద్రంలో గుడ

Published: Saturday February 25, 2023
చేవెళ్ల ఫిబ్రవరి 24, (ప్రజాపాలన):-

రంగారెడ్డి జిల్లా  చేవెళ్ల మండల కేంద్రంలో  భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భూ పోరాటం  11వ రోజు చేరుకోగా, గుడిసె వాసుల కోసం వైద్య సదుపాయం ఏర్పాటు చేసిన సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కే రామస్వామి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు ఇండ్ల స్థలాలు కావాలని గత 11 రోజులుగా సిపిఐ పేదల పక్షాన గుడిసెలు వేయించి భూ పోరాటం నిర్వహిస్తున్నదని పేదలు నిరంతరం రాత్రి .పగలు  గుడిసెలలో ఉంటున్నారని వారికి ఎలాంటి అనారోగ్య పరిస్థితులు ఎదురైన తక్షణమే ఆదుకోవడానికి వైద్య శిబిరాన్ని ఈరోజు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
ప్రభుత్వం ఇప్పటికైనా పేదల పక్షాన ఆలోచన చేసి వేసుకున్న పేదలందరికీ పట్టా సర్టిఫికెట్లు అందజేసి వారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
సిపిఐ పార్టీ అంటే ఒక విప్లవ పార్టీ కాదు పేదలకు ఎలాంటి కష్టాలు వచ్చినా ఆదుకునే ఒక గొప్ప సామాజిక లక్ష్యాన్ని కలిగిన పార్టీ సిపిఐ పార్టీ అని ఆయన కొనియాడారు.
గుడిసె వాసులకు న్యాయం కోసం భవిష్యత్తులో చేవెళ్ల పట్టణంలోని జాతీయ రహదారులను దిగ్బంధన చేయడానికి కూడా వెనకాడబోమని ఈ సందర్భంగా ఆయన‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు జిల్లా ఏఐటీయూసీ కార్యదర్శి వడ్ల సత్యనారాయణ సిపిఐ మండల కార్యదర్శి ఎం సత్తిరెడ్డి మండల కార్యదర్శి మల్లేష్ సిపిఐ సీనియర్ నాయకులు డాక్టర్ శౌరీలు మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మంజుల విజయమ్మ తదితరులు పాల్గొన్నారు.