సర్వేంద్రియానాం నయనం ప్రధానం

Published: Wednesday August 11, 2021
గ్లోబల్ కంటి ఆస్పత్రి మేనేజర్ విజేందర్
వికారాబాద్ బ్యూరో 10 ఆగస్టు ప్రజా పాలన : మానవ శరీర భాగాలలో అతి ముఖ్యమైన భాగం కళ్ళు అని గ్లోబల్ కంటి ఆస్పత్రి మేనేజర్ విజేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సాయిరాం ఆస్పత్రిలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటి చూపు కోల్పోయిన వారికి లోకమంతా అంధకారంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. సర్వేంద్రియానాం నయనం ప్రధానం ఆర్యోక్తి ననుసరించి కళ్ళను జాగ్రత్తగా చూసుకోవాలని హితవు పలికారు. కళ్లలో దుమ్ము ధూళి పడిన వెంటనే కుండా చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి సూచించారు. విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు బందెప్ప గౌడ్ మాట్లాడుతూ బొప్పాయి పండు ఆకుకూరలు తిన్నచో కంటి జబ్బులు రావని పేర్కొన్నారు అరవై ఐదు మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 15 మందికి శుక్లాలతో బాధపడుతున్నట్లు గుర్తించామని వివరించారు. ఆరుగురికి రెటీనా సమస్యలు ఉన్నట్లు పేర్కొన్నారు. 44 మందికి హ్రస్వ దృష్టి లోపం ఉన్నదని గుర్తించామన్నారు. శస్త్ర చికిత్స అవసరం ఉన్నవారిని గ్లోబల్ కంటి ఆసుపత్రికి వెళ్ళాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బెంజమిన్, శ్రీలత రెడ్డి, స్వప్న ప్రియ, విద్యాసాగర్, నరసింహారెడ్డి, ప్రభాకర్ గౌడ్, విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి ప్రశాంత్, గ్లోబల్ కంటి ఆస్పత్రి సీఈఓ కిమ్ రెడ్డి, ఆప్తాలమిక్ అసిస్టెంట్ పరమేశ్, మార్కెటింగ్ అసిస్టెంట్ మేనేజర్ మహేష్, విశ్రాంత ఉద్యోగులు సత్యనారాయణ, సతీష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.