రామారావు సేవలు మరువలేనివి..

Published: Thursday January 05, 2023
 రాష్ట్ర మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..
తల్లాడ, జనవరి 4 (ప్రజాపాలన న్యూస్)
 గ్రామాభివృద్ధిలో మాజీ సర్పంచ్ గురిజాల రామారావు సేవలు మరవలేనివని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొనియాడారు. మండలంలోని అంజనాపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గురజాల రామారావు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న తుమ్మల బుధవారం ఆయన  మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కొద్దిసేపు మాట్లాడి ఎలా మృతి చెందారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలన్నారు. నివాళులర్పించారు బీఆర్ఎస్  జిల్లా నాయకులు జక్కంపూడి కృష్ణమూర్తి, సిపిఎం నాయకులు తాత భాస్కరరావు, గ్రామ సర్పంచ్ కొమ్మినేని ప్రభాకర్,  ఎంపీటీసీ విద్యాసాగర్ రావు, నాయకులు పాసగులపాటి లక్ష్మీనారాయణ, దుందేటి వీరారెడ్డి, అనుమోలు బుద్ధిసాగర్, కొమ్మినేని వెంకటేశ్వర రావు, తదితరులు ఉన్నారు.