చేగువేరా ఆశయసాధనకోసం నేటి యువత ఉద్యమించాలి షేక్ బషీరుద్దీన్

Published: Wednesday June 15, 2022
పాలేరు జూన్. 14 ప్రజాపాలన ప్రతినిధి
 డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శుభ వీర 94 వ జయంతి కార్యక్రమంలో మాట్లాడుతూ
ప్రపంచ యూత్ ఐకాన్ చేగువేరా  ఆశయాల సాధనకై నేటి యువత ఉద్యమించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ పిలుపునిచ్చారు.
       స్థానిక సుందరయ్య భవన్లో డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుభవేళ 94 వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చేగువేరా చిత్రపటానికి పూలమాలవేసి అలంకరించి నివాళులర్పించారు.  అనంతరం డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు సత్తెనపల్లి నరేష్ అధ్యక్షతన జరిగిన సభలో జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ మాట్లాడుతూ పేదరికం, అసమానతలు, నిరుద్యోగం, అంటరానితనం,  రోగాలు,  కష్టాలు కన్నీళ్లు లేని సమాజం కావాలని చేగువేరా కోరుకున్నారని అట్లాంటి సమాజ నిర్మాణం కోసం నేటి యువత ఉద్యమించాలని షేక్ బషీరుద్దీన్ అన్నారు.
    నేటి భారతదేశంలో కూడా  పేదరికం నిరుద్యోగం దరిద్రం  విపరీతంగా పెరిగిపోతున్నాయని,  నేడు పాలిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాటల గారడీతో ప్రజలను మోసం చేస్తున్నాయని  అందుకే నిజమైన ప్రజల పక్షాన ఉండే పాలకులను ఎంచుకునేలా నేటి యువత రాజకీయాల్లోకి వచ్చి ప్రజలను చైతన్యం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
          ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు కూరపాటి శ్రీను, రావులపాటి నాగరాజు, రాయల శ్రీనివాసరావు, ఆర్టీసీ నాగేశ్వరరావు, నరేష్, ఉపేందర్, సుబ్బారావు, ఉమామహేశ్వరరావు, ప్రవీణ్, అరవింద్, సాజిద్ తదితరులు పాల్గొన్నారు.
        ఇట్లు
డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ.