శంకరపట్నంలో దామోదర్ రెడ్డి వర్ధంతి వేడుకలు

Published: Monday April 10, 2023

శంకరపట్నం ఏప్రిల్ 09 ప్రజాపాలన రిపోర్టర్:


శంకరపట్నం మండల కేంద్రంలో మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి వర్ధంతి వేడుకలను టిడిపి మండల శాఖ అధ్యక్షుడు సయ్యద్ ఆరిఫ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సయ్యద్ ఆరిఫ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ హయాంలో దామోదర్ రెడ్డి కరీంనగర్ జిల్లా టైగర్ గా ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఎండి సాబీర్, గోపు వీరమల్లు, ఊకంటి మధుకర్ ,గుర్రం బుచ్చయ్య, బొంగోని చందు, బైరి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.