సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు స్థానిక బ్యాంకుల్లోనే తీసుకోవాలి. సిపిఎం

Published: Saturday October 01, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 30 ప్రజాపాలన ప్రతినిధి


సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు స్థానిక బ్యాంకుల్లో తీసుకునేలా చర్యలు చేపట్టాలని సిపిఎం డిమాండ్  చేస్తుందని సిపిఎం నాయకులు అన్నారు.  బండ లేముర్  గ్రామానికి చెందిన జోగు బాగ్యమ్మ, జరుపుల సంగీత లు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందిన ఖర్చులు రు.15000లు, రు.10000 ల చొప్పున ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి సహకారంతో  మంజూరి కావడం జరిగింది. ఈ చెక్కులు నేడు  బాధితులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ పొచమోని కృష్ణ  మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చే డబ్బులు నిరుపేదల కు ఆర్థికంగా వెసలుబాటు ఇస్తుంది. కానీ వచ్చిన చుక్కలు స్థానిక బ్యాంకులో తీసుకోకుండా నగరంలో ఉన్న బ్యాంకు కు బాధితులను పంపిస్తున్నా రని అన్నారు. బాధితులు నగరానికి పోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కావున స్థానిక బ్యాంకుల్లోనే చెక్కులు తీసుకుని డబ్బులు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి వెంకటేష్, జోగు జగదీశ్వర్ , వట్టి రాజు, గడ్డం అంజయ్య, జే. కిషన్ నాయక్ , తదతరులు పాల్గొన్నారు.