పంట పొలాలు, గుడి, బడి తేడా లేకుండా మందుబాబులు ఆగడాలు బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం తాగకూడదనే ప

Published: Saturday April 08, 2023

బోనకల్, ఏప్రిల్ 7 ప్రజా పాలన ప్రతినిధి: మండలంలో పలు గ్రామాల్లో మందుబాబులు బహిరంగంగా పంట పొలాలు గుడి బడి తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ మద్యం సేవిస్తూ వీరంగం సృష్టిస్తున్నారు. ముఖ్యంగా మండల పరిధిలోని కలకోట గ్రామం ముత్యాలమ్మ గుడి సమీపంలో రాత్రి 9 గంటలనుండి అర్ధరాత్రి వరకు మందుబాబుల ఆగడాలు స్థానికులు,పరిసర పంట పొలాల రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు . త్రాగిన మద్యం సీసాలను పగలగొట్టి జనాలను సంచరించే ప్రదేశంలో, పంట పొలాలలో వేయడం వల్ల రైతన్నలు పనుల నిమిత్తం పాదరక్షలు లేకుండా పనులు నిర్వహించేటప్పుడు గాజు పెంకులు గుచ్చుకోవడం వలన గాయాల పాలవుతున్నారు. సమాజంలో బాధ్యత కలిగిన వ్యక్తులు ఎవరైనా మందు బాబులకు బహిరంగ ప్రదేశంలో తాగడం, మందు సీసాలు పగలగొట్టి జనసంచార ప్రదేశంలో పంట పొలాలలో వేయడం మంచిది కాదని చెప్పేవారిపై మద్యం మత్తులో దౌర్జన్యానికి దిగుతున్నారు మందుబాబులు. వెంటనే సంబంధిత అధికారులు, పోలీసు వారు స్పందించి మందుబాబుల ఆగడాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.