ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

Published: Monday April 18, 2022
మేడిపల్లి, ఏప్రిల్ 17 ప్రజాపాలన ప్రతినిధి : ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని  పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి సూచించారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ 2వ డివిజన్ కార్పొరేటర్ సుభాష్ నాయక్ ఆధ్వర్యంలో సేవ్ హాస్పిటల్ వారి సహకారంతో పంచవటి కాలనీలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని మేయర్ జక్క వెంకట్ రెడ్డి డిప్యూటి మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ జక్క వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి వైద్యసేవలు అందాలనే సంకల్పంతో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను ప్రతి ఆదివారం ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలు వారి ఆరోగ్య సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం కల్పించడం, ఉచితంగా మందులు అందించడం ద్వారా వారి ఆరోగ్య సమస్యలను సత్వరమే పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్న సేవ్ హాస్పిటల్ వారు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కౌడే పోచయ్య, హాస్పిటల్ డైరెక్టర్ సామ రాజిరెడ్డి, కాలనీ వాసులు శ్రీనివాస్ రెడ్డి, బండారి మల్లేష్, రాధాకృష్ణ, వి.శ్రీనివాస్, ప్రతాప్ రెడ్డి, ఉపామహేశ్వర్ రావు, చాడ సురేందర్ రెడ్డి, డాక్టర్లు, వైద్య సిబ్బంది, నాయకులు ఏనుగు మనోరంజన్ రెడ్డి, మల్లం వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.