వృద్ధాప్యంలో తల్లిదండ్రుల బాధ్యత పిల్లలదే

Published: Thursday September 29, 2022
మధిర  సెప్టెంబర్ 28 ప్రజాపాలన ప్రతిని ధి వృద్ధాప్యంలో తల్లిదండ్రుల బాధ్యత పిల్లలదేనని సర్పంచ్ బంగారమ్మ పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని మహాదేవపురం గ్రామపంచాయతీలో గ్రామ అంగన్వాడీ కేంద్రాలు ఆధ్వర్యంలో పోషణ మాసోత్సవం  సందర్భంగా వయోవృద్ధుల సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత పిల్లలపై ఉన్నదన్నారు. పిల్లలు కూడా తల్లిదండ్రుల భారం అని కాకుండా బాధ్యత తీసుకోవాలన్నారు. వృధ్యాప్యంలో ఏమైన సమస్యలు ఉంటే వృద్ధులు టోల్ ప్రీ నెంబర్ 14567 కి ఫోన్ చేస్తే సంబంధిత అధికారులు వచ్చి సమస్యలు పరిష్కరిస్తారన్నారు. 
ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు  హరిబండి ఉష, సోమా కమల ఏఎన్ఎం విజయకుమారి, ఆశ రాహేలు గ్రామ కార్యదర్శి సురేష్, రాజు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.