అడవిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది

Published: Friday February 05, 2021

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

 "అడవిలో నిప్పు జీవరాశులకు ముప్పు" గోడ ప్రతి ఆవిష్కరణ


ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన.

అడవిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని
అటవీ ప్రాంతాలు నిప్పు  అంటించకూడదని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. "అడవిలో నిప్పు జీవరాసులకు ముప్పు" అనే అంశంపై అటవీ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించే ఉద్దేశంతో రూపొందించిన గోడ ప్రతిని గురువారం జిల్లా అటవీశాఖాధికారి శాంతారామ్ తో కలిసి ఆయన తన ఛాంబర్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ ప్రాంతం సంరక్షణ పై అందరూ అవగాహన పెంచడానికి అటవీశాఖ సిబ్బంది చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. జంతువుల రక్షణ తో పాటు అడవుల రక్షణకు అటవీ శాఖ తో ప్రజలు సహకరించాలని సూచించారు అడవిలో ఎట్టి పరిస్థితుల్లో నిప్పు అంటించకూడదని అన్నారు. అనంతరం జిల్లా అటవీ శాఖ అధికారి శాంతారామ్ మాట్లాడుతూ అటవీ ప్రాంతాన్ని రక్షించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు  రానున్న వేసవికాలంలో అటవీ ప్రాంతంలో ఆకులు ఎక్కువగా రాలి ఉంటాయని అన్నారు. ఎవరైనా అటవీ ప్రాంతంలో నిప్పు పెడితే జంతువులకు ప్రాణ హాని కలిగే అవకాశం ఉందన్నారు ఎవరు కూడా అటవీ ప్రాంంతాల్లో నిప్పు పెట్టకూడదని సూచించారు. ఒకవేళ అటువంటి వారిని ఎవరైనా గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటవీ ప్రాంతంలో దొరికే ఇప్ప బంక మోదుగాకు తునికాకు వంటి వాటిని ఉపయోగించుకొని ప్రజలు ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాగజ్ నగర్ ఎఫ్ డి ఓ విజయ్ కుమార్, ఆసిఫాబాద్, రెబ్బెన, కాగజ్ నగర్, జోడేఘాట్, పెంచికలపేట రేంజ్ అధికారులు అప్పలకొండ, పూర్ణిమ, శివ కుమార్, శశిధర్ బాబు, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.