మిషన్ భగీరథ నీటితో పెద్దమ్మ గూడెం వాసులకు తీరిన కష్టాలు

Published: Tuesday May 18, 2021
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన మిషన్ భగీరథతో జిన్నారం గ్రామపంచాయతీ పరిధిలోని పెద్దమ్మగూడెం గ్రామ వాసుల కష్టాలు తొలిగిపోయాయి. ప్రతి ఇంటికి నల్లాలు బిగించి రోజూ వచ్చే నీటిని పట్టుకుంటున్నారు. గతంలో పెద్దమ్మగూడెం గ్రామంలో నీటి కష్టాలు ఉండేవి. భగీరథ రాకతో  ప్రజా ప్రతినిధులు కష్టాలు తీర్చారనీ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ తెచ్చి మా కష్టాలు తీర్చారు అని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. స్థానిక స్థానిక వార్డు సభ్యులు శ్రీనివాస్ యాదవ్ తో కలిసి మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు బ్రహ్మేందర్ గౌడ్ స్వయంగా ఇంటింటికి తిరిగి పరిశీలించారు.