తాగు నీటి కోసం రోడ్డెక్కిన మహిళలు

Published: Wednesday March 29, 2023
జన్నారం, మార్చి 28, ప్రజాపాలన:  తాగునీటి సమస్య తీర్చాలని మండలంలోని పోనకల్ మేజర్ గ్రామపంచాయతీ మహిళలు రోడ్డెకేక్కి రాస్తారోకో చేశారు.  మంగళవారం మండలంలోని పోనకల్ మేజర్  గ్రామపంచాయతీ రాంనగర్ చెందిన మహిళలు రోడ్డుపై రాస్తా రోక నిర్వహించారు. ఈ సందర్భంగా రాంనగర్ కు చెందిన మహిళలు మాట్లాడుతూ ఆర్ డబ్ల్యూ ఎస్ జై శ్రావ్య దృష్టికి పలుమార్లు తీసుకువెళ్ళ ఈ తాగు నీటి సమస్య గురించి వినతిపత్రలు అందజేసిన పట్టించి కోవడంలేదని, వేంటనే తగిన చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేశారు. గత కొంతకాలంగా అ కాలనీ కి తాగు నుండి సమస్య విషయమై, ఎన్నో సార్లు తీసుకెళ్లిన తెలియజేసినప్పటికీ, రాంనగర్ కు చెందిన మహిళలు తాగునీటి సమస్య తీర్చడంలేదని వారు వాపోయారు. చివరికి పోనకల్ గ్రామపంచాయతీ పరిధి రాంనగర్ చెందిన నీటి సమస్య తీరుస్తానని రోడ్డుపై బైఠాయించిన మహిళలకు, మండల ఎంపీపీ మాదాడి సరోజన జోక్యం చేసుకొని, సమస్య ను పరిష్కరిస్తానని, పై అధికారుల దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి తాగునీటి సమస్య పూర్తి చేస్తానని, హామీ నివ్వడంతో ఆ కాలనీకి చెందిన మహిళలు రాస్తారోకో ను విరమించారు. ఈ కార్యక్రమంలో రాంనగర్ కు చెందిన మహిళలు, నాయకురాలు, నాయకులు, పాల్గొన్నారు.