విద్యరంగాని కార్పోరేట్ శక్తులకు అప్పజేప్పేందుకే బడ్జెట్లో నిధులు తగ్గింపు

Published: Thursday February 03, 2022

నూతన విద్యావిధానం లక్ష్యాలు నేరవేరవు
డిజిటల్ యూనివర్శీటీ ప్రతిపాదన విద్యారంగానికే పెనుప్రమాదం
విద్యరంగానికి 10% నిధులు పెంచి ఇవ్వాలి.
ఎస్ఎఫ్ఐ యాచారం మండల అధ్యక్షులు విప్లవ్ కుమార్

ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి తేదీ 2 ప్రజాపాలన ప్రతినిధి : హైదరాబాద్ : కేంద్రంఏయేటి కయేడు విద్యారంగాన్ని విస్మరిస్తూనే ఉంది.ప్రతి బడ్జెట్ లో లాగానే ఈ సారికూడా అది నిరూపితమైంది. 2022 - 23 ఆర్థిక సంవత్సరానికి ఈ రోజు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ప్రభుత్వం విద్యారంగానికి అరకొర కేటాయింపులు జరిపింది. ఈ కేటాయింపులు విద్యారంగం  అభివృద్ధి  ఏమాత్రం సరిపోవు. నూతన విద్యావిధానంతో దేశంలో నూతన ఓరవడిని సృష్టిస్తామని చెప్పిన నరేంద్ర మోదీ ఈ కేటాయింపులు ఏ మాత్రం నూతన విద్యావిధానం లక్ష్యాలను సాధించలేదు. ఈ బడ్జెట్ నిధులు కేటాయింపు భవిష్యత్ విద్యారంగాని ప్రైవేట్, కార్పోరేట్ శక్తులు చేతిలో విద్యారంగాని పెట్టె కుట్రలో భాగంగా ఉంది. ఇది పూర్తిగా విద్యరంగాని విస్మరించే బడ్జెట్ అని అన్నారు. దేశంలో ప్రత్యక్ష తరగతికి భిన్నంగా డిజిటల్ విద్యను ప్రోత్సాహం కల్పిస్తున్నారు. దీనికోసం డిజిటల్ యూనివర్శీటీ స్థాపనకు కేంద్రం కుట్రలు చేస్తుంది. దీని ద్వారా విద్య కేంద్రీకరణ పెరగటం తోపాటు కోన్ని సెక్షన్ల విద్యార్ధులకే చదువు అందుతుంది. ఇప్పటికే దేశంలో డిజిటల్ విద్య అసమానతలు వల్లన అనేక మంది విద్యకు దూరం అయ్యారు. డ్రాఫౌట్స్ పెరిగాయి. ఆదివాసీ ప్రాంతాల్లో విద్యార్ధులకు ఇంటర్ నెట్ సౌకర్యం లేదు.డిజిటల్ యూనివర్శిటీ అంటే పూర్తి స్థాయిలో కార్పోరేట్ శక్తులే విద్యారంగంలో జోరబడే అవకాశం ఉంది. ఈ క్రమంలో దేశంలో నూతన విద్యాసంస్థల స్థాపన నూతన విద్య అవకాశలను బడ్జెట్లో ప్రస్తావించలేదు. ఉన్న యూనివర్శిటీలకు సౌకర్యాలు కల్పనలో నిధులు గురించి ప్రస్థావన లేదు. బడ్జెట్ పరీశీలిస్తే గతం కంటే పెరిగినట్లు ఉన్నా మొత్తం బడ్జెట్ పోల్చుకుంటే విద్యారంగానికి కేటాయింపులు తగ్గాయి. మొత్తం ₹39,44,909 కోట్ల బడ్జెట్ లో విద్యారంగానికి ₹1,01,800 కోట్లు మాత్రమే (2.58%) కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరం కేటాయింపులతో (2.25 %) పోలిస్తే పెరుగుదల నామమాత్రం. మొత్తం విద్యారంగ కేటాయింపుల్లో పాఠశాల విద్యకు ₹63449 కోట్లు, ఉన్నత విద్యకు ₹38351 కోట్లు కేటాయించింది. పాఠశాల విద్యలో ఉపాధ్యాయ శిక్షణ & వయోజన విద్యకు గత సంవత్సరం ₹250 కోట్లు కేటాయించి వాటిని అత్యంత కనిష్టంగా ₹2.75 కోట్లకు సవరించింది. ఈ సంవత్సరం ₹127 కోట్లు మాత్రమే కేటాయింపులు జరిపింది. ఇతర అంశాల్లో NMMS కు ₹350 కోట్లు, KVS కు ₹7650 కోట్లు, NVS కు ₹4115 కోట్లు, NCERT కి ₹510 కోట్లు, సమగ్ర శిక్ష కు ₹37383 కోట్లు కేటాయించింది. మధ్యాహ్న భోజన పథకం పేరు ప్రధానమంత్రి పోషన్ శక్తి నిర్మాన్ గా మార్చినా కేటాయింపులు పెంచలేదు.గత సంవత్సరం లాగే ₹10234 కోట్లు కేటాయించింది. కేంద్ర బడ్జెట్ లో విద్యారంగానికి 10 % కేటాయింపులు జరపాలన్న వివిధ కమీషన్ల సలహాల్ని విస్మరించి కేటాయింపులు 2.58% కి మాత్రమే పరిమితం చేసింది. ప్రభుత్వాలు విద్యారంగాన్ని విస్మరిస్తున్నట్లు నిన్న విడుదల చేసిన ఆర్థిక సర్వే కూడా నిరూపించింది. ఈ బడ్జెట్ దేశ విద్యారంగాని మార్చేలా లేదు కదా కనీసం కరోనా లాంటి మహమ్మారి వస్తే కనీసం మౌళిక సదుపాయాలు కల్పించేలా కూడా లేదు.ఈ బడ్జెట్ నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు ఎస్.ఎఫ్.ఐ. పిలుపునిస్తంది.. అని వారు అన్నారు.