మూడు నియోజకవర్గాలలో గెలిచి బహుమతిగా ఇవ్వాలి

Published: Tuesday January 24, 2023
పార్లమెంట్ వ్యవహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి : వికారాబాద్ పరిగి తాండూర్ నియోజకవర్గాలలో గెలిచి బహుమతిగా అందజేయాలని పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నాయక్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కొండా బాలకృష్ణారెడ్డి వేడుక వేదికలో లోక్ సభ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు తొడిగల సదానంద్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమాశానికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ బూతు కమిటీలు ఏర్పాటు చేసి రాబోవు ఎన్నికలకు సన్నద్ధమవ్వాలని సూచించారు. బూతుస్థాయి అధ్యక్షునిగా పని చేసిన వ్యక్తులు ఉన్నత పదవులు పొందుతారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును ఉదహరించారు.
ప్రధాని మోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఎంతో పురోగతి సాధిస్తుందని స్పష్టం చేశారు. కరోనా మహమ్మవారిని సృష్టించిన చైనా దేశమే ఇంకా విలవిలలాడుతుందని తెలిపారు. దేశంలో కరోనా నియంత్రణకు మోదీ ప్రభుత్వం కృషి అద్వితీయమని కొనియాడారు. ప్రపంచ దేశాలకు కరోనా నియంత్రణకు వ్యాక్సిన్లు అందజేసిన ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుందని గుర్తు చేశారు. తెలంగాణను సాధించుకున్నది రాష్ట్ర అభివృద్ధికి కానీ కెసిఆర్ కుటుంబ సభ్యులు మాత్రమే అందనంత స్థాయికి ఎదిగారని దెప్పి పొడిచారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశం అభివృద్ధి చెందితే తెలంగాణలో మాత్రం ప్రభుత్వం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని ధ్వజమెత్తారు. విద్యుత్తు ఉత్పత్తిలో దేశంలోనే  అధిక ఉత్పత్తి చేయడమే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా సరఫరా చేస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నిరంతర విద్యుత్తు సరఫరా చేస్తుందంటే అందుకు కారణం కేంద్ర ప్రభుత్వ సహకారమేనని స్పష్టం చేశారు. కేంద్రం నుండి నిధులు వస్తే వాటికి సరైన లెక్కలు చూపకుండా తాత్సారం చేస్తున్న సీఎం కేసీఆర్ అని ఘాటుగా స్పందించారు. కేంద్ర మంత్రిగా రాష్ట్రానికి వచ్చినప్పుడు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాకు ఘన స్వాగతం పలికారని గుర్తు చేశారు. బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర ప్రజలలో స్పందన ఎలా ఉందని ప్రశ్నించానన్నారు. అందుకు బండి సంజయ్ సమాధానం ఇస్తూ అంచనాలకు మించి ప్రజల నుండి అపూర్వ స్పందన లభించిందని బదులిచ్చారని తెలిపారు. పాదయాత్ర వలన రాష్ట్ర రాజకీయాలలో చలనం తెప్పించిందన్నారు.
ఆహార ధాన్యం, కోవిడ్ వ్యాక్సిన్ లను ఉచితంగా అందజేసిన ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుందని అన్నారు.
ప్రతి బూత్ స్థాయి కార్యకర్త11 ఇండ్లకు వెళ్ళి మోదీ ప్రవేశ పెట్టిన పథకాల గురించి వివరించాలని సూచించారు. 2024లో మోదీ ప్రభుత్వమే వస్తుందని ఘంటాపథంగా చెప్పారు. టిఆర్ఎస్ బిఆర్ఎస్ గా మారినా ప్రయోజనం శూన్యం అవుతుందని విమర్శించారు. ఎందుకంటే విపక్షాలు ఐకమత్యంగా ఉండలేక ఎవరి దారిన వారు ఉంటారని దెప్పి పొడిచారు. మాజీమంత్రి డాక్టర్ ఏ చంద్రశేఖర్ మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా పరిధిలోని వికారాబాద్ తాండూర్ పరిగి నియోజకవర్గాలలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రణాళిక అబద్ధంగా రాబోవు ఎన్నికల్లో ఒక సైనికుల పనిచేసే కార్యకర్తలు ఉన్నారని చెప్పారు. భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడుతూ గెలుపే లక్ష్యంగా కృషి చేస్తామన్నారు. మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి బూత్ సయి కార్యకర్త బిజెపి గెలుపు కొరకు బాధ్యతాయుతంగా కృషి చేయాలని హితువు పలికారు. ఏ ఆంక్షతో తెలంగాణను సాధించుకున్నాము ఆ అంశం నెరవేర్చలేక కేసీఆర్ చతికిల పడ్డాడని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి సత్తా చాటడానికి ఛాయాచక్తుల కృషి చేయాలని సూచించారు. జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ జిల్లా పరిధిలోని మూడు నియోజకవర్గాలలో గెలిపే లక్ష్యంగా కృషి చేస్తామని సభాముఖంగా హామీ ఇచ్చారు. ప్రతి కార్యకర్తను సమన్వయ పరుస్తూ ఐకమత్యంతో ముందుకు వెళ్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కోటి గారి శివరాజ్ కోకట్ పార్లమెంట్ కన్వీనర్ మల్లారెడ్డి మాధవరెడ్డి పాండుగౌడ్ గణపురం వెంకటేష్ నందకుమార్ యాదవ్ ఆకుల విజయ్  ప్రభాకర్ విజయభాస్కర్ రెడ్డి సత్యనారాయణ రెడ్డి మదనపల్లి సర్పంచ్ విజయ రాజ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.