తెలంగాణ సంస్కృతికి ప్రతీక మన బతుకమ్మ అందుకే ప్రతి ఆడపడుచుకు చీర ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్య

Published: Tuesday September 27, 2022

కోరుట్ల, సెప్టెంబర్ 26 (ప్రజాపాలన ప్రతినిధి):  కోరుట్ల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం రోజున  కోరుట్ల పట్టణ ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా ప్రభుత్వం అందజేస్తున్న బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే కల్వకుంట్ల  విద్యాసాగర్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మాట్లాడుతు పేద ధనిక అనే బేధం లేకుండా అందరూ కలసి ఆడుతూ పాడుతూ సంతోషంగా జరుపుకునే వేడుక బతుకమ్మ అని, తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర పండుగ గుర్తించిందని ఈ సందర్భంగా ప్రత్యేకంగా బతుకమ్మ కానుకగా ఆడపడుచులకు చీరలు పంపిణీ చేశారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ అన్నం లావణ్య అనిల్,  మున్సిపల్ కౌన్సిలర్లు ,తెరాసా నాయకులు పాల్గొన్నారు .