సేవాలాల్ మహారాజ్ అందరికీ గురువు: బీజేపీ యువ నాయకులు బీపీ నాయక్

Published: Thursday February 17, 2022

బోనకల్, ఫిబ్రవరి 16 ప్రజాపాలన ప్రతినిధి : స్థానిక మండల కేంద్రంలోని గిరిజన కాలనీలో శ్రీ సేవాలాల్ మహారాజ్ 283వ జయంతి వేడుకలను ఘనంగా సేవాలాల్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం యువకులకు, బాలురకు బ్యాట్మెంటన్ క్రీడలు, మహిళలకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి బహుమతులను ప్రధానం చేశారు. సేవాలాల్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న బోనకల్ సర్పంచ్ సైదా నాయక్ మాట్లాడుతూ సేవాలాల్ జీవన విధానం ఇప్పటి తరానికి ఎంతో ఆదర్శప్రాయం అని ఆయన బాటలో యువత పయనించాలని సూచించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మేఘ శ్రీ హాస్పిటల్స్ ప్రముఖ వైద్యులు గంగాధర్ గుప్తా మాట్లాడుతూ ఇలాంటి పండగలు ప్రజల మధ్య ఐక్యతను సూచిస్తాయని, భవిష్యత్ అంతా యువతరానిదేనని ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని కోరారు. విశిష్ట అతిథులుగా పాల్గొన్న బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు గుగులోత్ నాగేశ్వరరావు, బిజెపి యువ మోర్చా మండల అధ్యక్షులు కాలాసాని పరశురాం ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, సేవాలాల్ జీవిత ఇతివృత్తం గురించి వివరించారు. ఈ వేడుకలు బీజేపీ యువనేత బిపి నాయక్ సారథ్యంలో సేవాలాల్ మహారాజ్ ఉత్సవ కమిటీ వేడుకను విజయవంతం చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు భూక్యా రమేష్ నాయక్, గుగులోత్ కిషోర్, సైదులు, గోపి, సుమన్, తరుణ్, భరత్, అస్లాం, దుర్గారావు, బానోతు మురళి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.