హన్మంతరావు ఆకస్మిక తనిఖీలు

Published: Thursday July 28, 2022
యాదాద్రి భువనగిరి జిల్లా 27 జులై ప్రజాపాలన: హన్మంతరావు ఆకస్మిక తనిఖీలు.తెలంగాణ రాష్ట్ర 
పంచాయితీ రాజ్ కమిషనర్ యం.హనుమంత్ రావు యాదాద్రి జిల్లా లోని పలు మండలాల్లో  బుధవారం నాడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా   బీబీనగర్ మరియు యాదగిరిగుట్ట మండలాలను  తనిఖీ చేశారు.
బీబీ నగర్ మండలంలోని మహదేవ్ పూర్  గ్రామంలో  ఉపాధి హామీ పథకం పనులు, సీజనల్ వ్యాధుల పై తీసుకుంటున్న చర్యలు, హరితహరం మొక్కల పంపిణీ, పల్లె ప్రగతి పనులు, ఉపాధి హామీ పనుల 7 రిజిష్టర్ లను పరిశీలించి సక్రమంగా నిర్వహించడం లేదని  అసంతృప్తి వ్యక్తం చేస్తూ సంబంధిత పంచాయితీ సెక్రటరికి షో కాజ్ నోటీస్ జారీ చేయవలసిందిగా జిల్లా పంచాయతీ అధికారికి పంచాయితీ రాజ్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. తదుపరి 
 యాదగిరి గుట్ట మండలం వంగపల్లి గ్రామంలోని నర్శరిని , ఉపాధి హామీ పథకం పనులను, సీజనల్ వ్యాధుల పై తీసుకుంటున్న చర్యలు, 7 రిజిష్టర్ లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసి గ్రామంలో హరితాహారం మొక్కల పంపిణీ పై ఇంటింటికీ తిరిగి పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా పరిషత్ ముఖ్య నిర్వాహణాధికారి  కృష్ణ రెడ్డి,  డి.ఆర్.డి.ఏ. ప్రాజెక్ట్ డైరెక్టర్  యం.ఉపేందర్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సునంద,  సంబంధిత మండలాల మండల పరిషత్ డెవలప్ మెంట్ అధికారులు, తహసిల్దార్ లు , డివిజనల్ ప్రాజెక్టు అధికారులు మండల స్థాయి అన్ని  శాఖల అధికారులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area