మిర్చి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని

Published: Thursday January 20, 2022
మధిర జనవరి 19 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం మల్లారం గ్రామంలో మిర్చి రైతు సదస్సు సమావేశం లోమిర్చి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ జనవరి 21న ఖమ్మం హార్టికల్చర్ ఆఫీస్ వద్ద జరిగే రైతు ధర్నా జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొండపర్తి గోవిందరావు రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఆవుల వెంకటేశ్వరరావు కోరారు బుధవారం మధిర మండలం మల్లారం గ్రామంలో మిర్చి రైతుల సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా రాంబాబు, గోవిందరావు, వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిర్చి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రం లో మిర్చి రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి అని ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు జనవరి 21న ఖమ్మం హార్టికల్చర్ ఆఫీస్ వద్ద జరిగే రైతు ధర్నా జయప్రదం చేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మందడపు ఉపెంద్రరావు, రైతు సంఘాల నాయకులు మలీదు నాగేశ్వరరావు, మందడపు రాణి, మందా సైదులు, శ్రీనివాస్ రావు, అర్జున్ రావు, ప్రభాకర్ రైతులు పాల్గొన్నారు