ఉచితపశు వైద్య శిబిరం విజయవంతం

Published: Saturday January 28, 2023

మధిర రూరల్ జనవరి 27 ప్రజాపాలన ప్రతినిధి
మధిర మండలం చిలుకూరు గ్రామంలో, "ఉచిత పశు వైద్య శిబిరం" డాక్టర్ కె కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించినారు. ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ శ్రీమతి నిడమానూరు సంధ్య చే ప్రారంభించినారు*
ఈ శిబిరంలో ఎదకురాని పశువులు, తిరిగిపొర్లే పెయ్యలు,పడ్డలు, చూడి పరీక్షలు, మరియు వ్యాధులకు చికిత్సలు చేసినారు. లేగ దూడలకు నట్టల నివారణ మందులు త్రాగించినారుఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో పాడి పశు రైతులు ఉచిత పశు వైద్య శిబిరాలని సద్వినియోగం చేసుకొవాలని కోరినారు. మరియు డాక్టర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ పశువులను శాస్త్రీయ పద్ధతిలో పెంపకం చేపడితే మంచి లాభదాయకమని, రానున్న వేసవిలో పశువులు వేడి తాపానికి, పాల దిగుబడి తగ్గకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెళకువలు, వివిధ రకాల వ్యాధుల  గురించి వివరించనైనదిఈ శిబిరంలో పశు వైద్య సహాయకులు వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్ లక్ష్మణరావు, వెటరినరి అసిస్టెంట్ శ్రీమతి భారతి, స్థానిక గోపాల మిత్రుడు సురేష్ మరియు రైతులు ఇమ్మడి కోటయ్య, కొండలు, నిడమానూరు అప్పారావు గార్లు పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేసినారు