డయల్ యువర్ డి. యం. కార్యక్రమం

Published: Friday May 27, 2022

 మధిర మే 26 ప్రజా పాలన ప్రతినిధి టి ఎస్ ఆర్ టి సి డిపో మేనేజర్ గురువారం నాడు నందు జరిగిన డయల్ యువర్ డి. యం. కార్యక్రమం నందు ప్రయాణికులు మరియు పరిసర ప్రాంత ప్రజల నుండి విశేష స్పందన వచ్చినది. ఈ కార్యక్రమం లో అధిక శాతం మంది ప్రజలు మధిర నుండి నందిగామ కు అదనపు ట్రిప్పులు నడపమని కోరినారు. దానికి డిపో మేనేజర్  ప్రయాణికుల అవసరానికి అనువైన సమయంలో అదనపు ట్రిప్పులు ఏర్పాటు చేస్తామని తెలిపారు.కోన జగదీశ్ గారు మధిర అంబేద్కర్ సెంటర్ నందు బస్ షెల్టర్ ఏర్పాటు చేయుట గురించి అడుగగా, స్థలం పరిశీలన చేసి పంచాయతీ వారి అనుమతితో బస్ షెల్టర్ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తామని డిపో మేనేజర్  తెలియ జేశారు.రామకృష్ణ  వైరా -నెమలి బస్ ఏర్పాటు గురించి, మధిర -మైలవరం -హనుమాన్ జంక్షన్, మధిర -పెనుగంచిప్రోలు సర్వీస్ ల గురించి అడిగినారు. అవి ఇంటర్ స్టేట్ సర్వీస్ లు కావడం వలన పై అధికారుల అనుమతితో పరిశీలిస్తామని తెలియజేసారు.మధిర నుండి విజయవాడ కు సాయంత్రం 5గంటలకు బస్ ఏర్పాటు చేయమని, విజయవాడ నుండి మధిర కు రాత్రి 8గంటలకు బస్ ఏర్పాటు చేయమని కోరగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల సమయాలలో మార్పులు చేస్తామని తెలియజేసారు.కంచికచర్ల మరియు భీమవరం లకు నైట్ హల్ట్ బస్ లను ఏర్పాటు చేయమని కోరగా గతంలో ఆ సర్వీస్ లు నడపడం జరిగిందని ఆదాయం సరిగా రాని కారణంగా రద్దు పరచడం జరిగింది అని తెలియజేసారు. ఈ కార్యక్రమం నందు పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలియజేస్తూ టి ఎస్ ఆర్ టి సి మధిర డిపో అభివృద్ధికి ప్రయాణికులు తమ వంతు సహకారం అందిస్తూ అందరూ ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణించేలాగున తమ వంతు సహకారం అందిచవలసినదిగా మధిర డిపో మేనేజర్ శ్రీ యస్. దేవదానం  కోరినారు.