బ్లడ్ బ్యాంకు వాహనాల ఉద్యోగాలు వికారాబాద్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యాదయ్య

Published: Wednesday June 16, 2021
వికారాబాద్ జూన్ 15 ప్రజాపాలన బ్యూరో : తెలంగాణ వైద్య విధాన పరిషత్ వికారాబాద్ పరిధిలోని ఆసుపత్రిలో గల బ్లడ్ బ్యాంక్ వాహనము సంబంధించిన ఉద్యోగాల ప్రకటన 11 ఫిబ్రవరి 20 21న ఇచ్చచామని వికారాబాద్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యాదయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందుకు సంబంధించిన అర్హుల జాబితా జిల్లా హెడ్ క్వార్టర్స్ ఆస్పత్రిలోని నోటీస్ బోర్డ్ నందు అతికించబడిందని గుర్తు చేశారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన వారు ఏమైనా అభ్యంతరాలు ఉన్న ఎడల 19 జూన్ 20 21 లోపల తెలుపగలరని సూచించారు.