అత్యాచారం చేసి హత్యచేసిన హంతకులను వెంటనే శిక్షించాలి.

Published: Monday May 31, 2021

బెల్లంపల్లి, మే 30, ప్రజాపాలన ప్రతినిధి : ఇటీవల గిరిజన అమ్మాయిపై అత్యాచారం చేసి హత్య చేసిన హంతకులను వెంటనే ప్రజల మధ్యలోనే శిక్షించాలని అఖిలభారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య రాష్ట్ర సహాయ కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. ఆదివారం నాడు స్థానిక ఎం సి పి ఐ యు పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ   రాష్ట్రంలో విద్యార్థినిలపై, మహిళలపై జరుగుతున్న హత్యాచారాలకు నిరసనగా నల్ల జెండాలతో నిరసన తెలిపారు, అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తండా ధర్మారం శివారు సీతారాంపుర తండాకు చెందిన మోడు ఉష(18)ను అత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేసిన హంతకులను వెంటనే పట్టుకొని ఫాస్ట్ ట్రాక్ కోర్టు  ద్వారా విచారణ జరిపి  ఉరి శిక్ష విధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు, మోడు ఉష మరిపెడ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయంలో డిగ్రీ చదువుతోందని, పేదరికం నుంచి వచ్చి ఉన్నతవిద్యాభ్యాసం చేస్తున్న అమ్మాయి పట్ల ఇలాంటి దారుణం జరగడం క్షమించరానిదని, మహిళల కోసం ప్రభుత్వాలు ఎన్నో చట్టాలను తెచ్చిన అవి అమలుకు నోచు కోవడం లేదని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే పోకిరీలను ప్రజల మధ్యలో ఎన్కౌంటర్ చేయాలని మహిళ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని, మృతి చెందిన అమ్మాయి మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ, అమ్మాయి కుటుంబానికి 50లక్షల రూపాయల నష్టపరిహారంతో పాటు వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, ఇలాంటి వి పునరావృతం కాకుండా చూడాలని, ఈ అఘాయిత్యానికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని  ఆయన డిమాండ్ చేశారు.