మెడికల్ కాలేజీని బెల్లంపల్లిలోనే ఏర్పాటు చేయాలి

Published: Wednesday May 19, 2021

బెల్లంపల్లి, మే 18, ప్రజాపాలన ప్రతినిధి: ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంలో భాగంగా మంచిర్యాల జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసే మెడికల్ కాలేజీని బెల్లంపల్లి లోనే నిర్మించాలని మాజీ ఎమ్మెల్యే అము రాజుల శ్రీదేవి అన్నారు. మంగళవారం నాడు పత్రికలకు ప్రకటన విడుదల చేస్తూ తెలుగుదేశం హయాంలో చేపట్టిన మెడికల్ కాలేజీ భవన నిర్మాణ స్థలంలోనే ప్రస్తుతం మంచిర్యాల జిల్లా కు కేటాయించిన మెడికల్ కాలేజీని బెల్లంపల్లి లో నిర్మాణం చేపట్టాలని, బెల్లంపల్లిలో వైద్య కళాశాలకు అనువైన స్థలము మరియు అన్ని ఏర్పాట్లు హంగులు బెల్లంపల్లి పట్టణంలో ఉన్నాయని అటు మహారాష్ట్ర వారికి ఇటు గోదావరిఖని వరకు  ఉన్న ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కావున బెల్లంపల్లి పట్టణం లోనే మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ఆమె కోరారు, గతంలో రాజకీయ పార్టీల మధ్య సమన్వయ లోపం వల్ల టెస్లా కంపెనీ వారు చేపట్టిన నిర్మాణ పనులు నిలిచి పోవడం దురదృష్టకరమని ఏది ఏమైనా కెసిఆర్ ప్రకటించిన 6 వైద్య కళాశాలలో మంచిర్యాల జిల్లాకు కేటాయించడం హర్షణీయమని అన్నారు, వైద్య కళాశాల నిర్మాణం కోసం పార్టీలకతీతంగా మెడికల్ కళాశాలను సాధించుకోవడంలో అందరూ కలిసికట్టుగ ఉద్యమాలకు సిద్ధం కావాలని అన్ని పార్టీల నాయకులకు ఆమె విజ్ఞప్తి చేశారు. అనంతరం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం నాడు బెల్లంపల్లి లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ బెల్లంపల్లి లోనే మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని, డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు ఎండి చాంద్ పాషా, గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు లాల్ కుమార్, న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు రత్నం తిరుపతి, ఏ ఐ కె ఎమ్ ఎస్ జిల్లా అధ్యక్షులు చరణ్ తదితరులు పాల్గొన్నారు.